ఐ.టి.డి.ఏ. పి.ఓ పై ఆరోపణలు చేయడం అన్యాయం,మంత్రి అనిల్ కు అరవ పూర్ణ వినతి

0 5

నెల్లూరు ముచ్చట్లు:

 

 

నీతి ,నిజాయితీ గల దళిత అధికారి , పేదల పెన్నిది ఐ.టి.డి.ఎ పీ ఓ అయిన మణికుమార్ పై అసత్య ఆరోపణలు చేసి , దళితుల ఆత్మగౌరవాన్ని దిగజారుస్తున్న గిరిజన నాయకులు అని చెప్పుకొని తిరుగుతున్న కె.చినపెంచలయ్య , గిరిజన ఉపాధ్యాయుడైన చేవూరు సుబ్బారావు ల పై తగు విచారణ జరిపి న్యాయం చేయాలని రాష్ట్రజలవనరుల శాఖా మంత్రి డా ॥ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ కు  మంత్రి కార్యాలయం లో ఏ.పి దళితసేన రాష్ట్రకార్యదర్శి అరవపూర్ణప్రకాష్ నేతృత్వంలో వినతిపత్రం అందచేసి మాట్లాడారు. చిన్న పెంచలయ్య అనే అతను గిరిజన సంఘాన్ని అడ్డం పెట్టుకుని దళిత ఉద్యోగులను , గిరిజన హాస్టల్ల అధికారులను భయబ్రాంతులకు గురిచేస్తూ , వారి పై అసత్య ఆరోపణలు చేయడం అన్యాయంఆని తెలిపారు. మంత్రి స్పందించి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి వీరి ఇరువురిపై విజిలెన్స్ చే విచారణ జరిపి గట్టి చర్యలు తీసుకోవాలని తెలిపారు. మరోమారు ఇటువంటి పరిణామములు తలెత్తకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో దళిత ,గిరిజన నాయకులు కరుణాకర్ , పోతురాజు రవి, రాజారావు, కైలాసం సతీష్ , రాజన్ , నారాయణ, భాస్కర్ , లింగాల రవి , చేను సుజాత , గోనె సుధాకర్ తదితరులు పాల్గొన్నారు .

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:ITDA It is unfair to make allegations against PO, the sixth full request to Minister Anil

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page