ఓవర్ కాన్ఫిడెన్స్ కొంపముంచింది

0 10

కోల్ కత్తా ముచ్చట్లు:

 

పశ్చిమ్ బెంగాల్‌‌లో అధికారం చేజిక్కించుకోడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలమైన విషయం తెలిసిందే. అయితే, బెంగాల్‌లో ఓటమికి గల కారణాలపై బీజేపీ నేతసువేందు అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  పూర్బ మేదినిపూర్ జిల్లా చందీపూర్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అతివిశ్వాసమే బీజేపీ ఓటమికి కారణమని అన్నారు. ఎన్నికల ప్రారంభమైన తర్వాత పార్టీ 170-180 సీట్లలో విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారని సువేందు వివరించారు.తొలి రెండు దశల్లో ఎన్నికలు జరిగిన అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీదే పైచేయిగా ఉంది.. దీంతో పార్టీ నాయకుల్లో అతివిశ్వాసం ఎక్కువయ్యింది.. అప్పటి నుంచి బీజేపీ 170-180 స్థానాల్లో విజయం సాధిస్తామనే నమ్మకంతో క్షేత్రస్థాయిలో అలసత్వం ప్రదర్శించారు.. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది’ అని సువేందు వ్యాఖ్యానించారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోడానికి క్షేత్రస్థాయిలో పనితీరు చాలా ముఖ్యమైందని, దీనికి మరింత కష్టపడి పనిచేయాలని అన్నారు. సువేందు వ్యాఖ్యలపై అధికార టీఎంసీ స్పందిస్తూ.. ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరిచిపోయినట్టున్నారని ఎద్దేవా చేసింది.

 

 

 

 

- Advertisement -

తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక సంక్షేమ పథకాలను సువేంద్ మరిచిపోయినట్టున్నారు.. సీఎం, టీఎంసీపై చేసిన తప్పుడు ప్రచారానికి ప్రజలు సరైన తీర్పునిచ్చి బీజేపీకి గుణపాఠం చెప్పారు’ అని ఆయన చురుకలంటించారు.‘కాషాయ కూటమి 200 సీట్లు దాటుతుందని చాలా మంది బీజేపీ నాయకులు ఊహించుకుని మూర్ఖుల మాదిరిగా స్వర్గంలో విహరించారు… ఇతరులపై తప్పును ఎందుకు నెడుతున్నారు? తన పార్టీకి కనీసం 180 సీట్లు వస్తాయని సువేందు కూడా పదేపదే ప్రగల్భాలు పలుకుతున్నారా? అసలు వారికి బెంగాల్ ప్రజల నాడి వారికి తెలియదు.. అదేంటో తృణమూల్‌కి తెలుసు’ అని కునాల్ ఘోష్ అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి 213 సీట్లు రాగా.. బీజేపీ 73 స్థానాల్లో విజయం సాధించి ప్రతిపక్ష పాత్రకే పరిమితమయ్యింది.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Overconfidence abounds

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page