కత్రినా కైఫ్ అస్తులెంతో తెలుసా!

0 26

ముంబై ముచ్చట్లు :

 

 

తన అందాలతో కట్టి పడేసే కత్రినా కైఫ్ ఆస్తులెంతో తెలిస్తే ఎవరికైనా కళ్ళు తిరగడం ఖాయం. సుమారు 40కి పైగా సినిమాల్లో ఆడిపాడిన కత్రినా.. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. వాణిజ్య ప్రకటనలు, తన మేకప్‌ బ్రాండ్‌ ‘కే బ్యూటీ’ ద్వారా వచ్చే ఆదాయం దీనికి అదనం. ఆమెకు ముంబైలో ఓ విలాసవంతమైన ఇల్లు ఉంది. దీని ఖరీదు సుమారు రూ.8 కోట్లు ఉంటుందని అంచనా. లండన్‌లోనూ ఏడు కోట్ల రూపాయల విలువ చేసే బంగ్లా ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు కోట్లు విలువ చేసే భూమి కూడా తన పేరు మీద ఉందట. ఇక కార్ల మీద మోజు పడే కత్రినా గ్యారేజీలో ల్యాండ్‌ రోవర్‌ రేంజ్‌ రోవర్‌ వోగ్‌ ఎల్‌డబ్ల్యూబీతో పాటు మెర్సిడిస్‌ ఎమ్‌ఎల్‌ 350, ఆడీ క్యూ 7 కార్లు కూడా ఉన్నాయి. మొత్తంగా కత్రినా కైఫ్‌కు రూ.150 కోట్ల పైచిలుకు ఆస్తి ఉండొచ్చని సమాచారం.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Did Katrina Kaif Know With Assets!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page