కరోనా భయం…..యేడాదిన్నర పాటు గదిలోనే

0 19

రాజమండ్రి  ముచ్చట్లు:
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్నే హడలెత్తిస్తోంది. జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఓ కార్యానికి వెళ్లలేక, ఓ విహార యాత్రకు వెళ్లలేక.. ఆఖరికి తమ ఇంటి నుంచి పక్కింటికి వెళ్లాలన్నా భయపడిపోతున్నారు. తేడా వస్తే ప్రాణాలే పోతాయని భయం వారిలో చేరింది. అయితే, కరోనా ఎఫెక్ట్కు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం కడలి గ్రామంలో విచిత్ర సంఘటన వెలుగు చూసింది. కరోనా సోకుతుందనే భయంతో ఓ కుటుంబ సభ్యులు.. ఏడాదిన్నర కాలంగా స్వీయ గృహ నిర్బంధంలో ఉండిపోయారు. కరోనా భయంతో ఒకే గదిలో ఏడాదిన్నర నుంచి జీవనం సాగిస్తున్నారు. అయితే మరీ చిత్రంగా కాలకృత్యాలు, నిద్రాహారాలు అన్నీ అదే ఒకే గదిలో కానిచ్చేస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు. ఈ కుటుంబంలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండగా.. తండ్రి చుటుకుల బిన్ని, కుమారుడు మాత్రమే అడపాదడపా బయటకు వస్తుంటారు.
అయితే, ఇంటి స్థలం విషయంలో బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేయించేందుకు అధికారులు వారిక ఇంటికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. స్థలం విషయమై వేరిఫికేషన్ కోసం వచ్చిన వాలంటీర్కు.. ఆ కుటుంబ సభ్యులు షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఇంట్లోనే ఉండి తమకు స్థలం వద్దని, తాము బయటకు రామని తెగేసి చెప్పారు. వారు అలా అనడానికి గల కారణం ఏంటా అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్.. అధికారులకు సమాచారం అందించారు. రాజోలు ఎస్ఐ కృష్ణమాచారి ఆధ్వర్యంలో వారిని ఇంటికి బయటకు వచ్చేలా చేశారు. అయితే ఏడాదిన్నర కాలంగా ఒకే గదిలో కాలకృత్యాలు, నిద్రాహారాలు చేయడంతో ఇంట్లో ఉంటున్న ముగ్గురు మహిళ ఆరోగ్యం క్షీణించిపోయింది. వారికి చికిత్స అందించేందుకు రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు,

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

- Advertisement -

Tags:Corona fear… ..in the room for a year and a half

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page