కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ లోక్‌సభ, రాజ్యసభల నేతల నియామకం

0 4

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఉభయసభల్లో పార్టీ గళం వినిపించడానికి లోక్‌సభ, రాజ్యసభల నేతలను కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ పునర్‌ నియమించారు. లోక్‌సభలో పార్టీ నేతగా అధిర్‌ రంజన్‌ చౌధురి, ఉపనేతగా గౌరవ్‌గొగోయ్, చీఫ్‌ విప్‌గా కె.సురేశ్, విప్‌లుగా రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టు, మాణిక్కం ఠాగూర్, ఇంకా మనీష్‌ తివారి, శశిథరూర్‌లను నియమించారు. రాజ్యసభలో నేతగా మల్లికార్జున ఖర్గే, ఉపనేతగా ఆనంద శర్మ, చీఫ్‌ విప్‌గా జైరాం రమేశ్‌లను నియమించారు. ఇంకా సీనియర్‌ నేతలు అంబికా సోని, పి.చిదంబరం, దిగ్విజయ్‌ సింగ్, కేసీ వేణుగోపాల్‌లను నియమించారు. ఆయా నేతలు ఎప్పటికప్పుడు సమావేశమై సభల్లో లేవనెత్తాల్సిన అంశాలను చర్చించాలని సోనియా గాంధీ ఆదేశించారు. ఉభయసభల నేతలు సమావేశమైనప్పుడు మల్లికార్జున ఖర్గే సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:Appointment of Leaders of Congress Parliamentary Party Lok Sabha and Rajya Sabha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page