గ్రామాలలో ఉచితంగా వైస్సార్ కంటి వెలుగు పరీక్షలు

0 7

తుగ్గలి  ముచ్చట్లు:
మండల పరిధిలోని మారుమూల గ్రామాలలో కూడా ఉచిత వైయస్సార్ కంటి వెలుగు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి,విఆర్వో వెంకన్న లు తెలియజేశారు.తుగ్గలి మండల పరిధిలోని ఉప్పరపల్లె గ్రామంలో సోమవారం రోజున వైయస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా ఉచితంగా గ్రామాల్లో వృద్ధులకు సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గ్రామంలోని 12 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో పేదలకు ఎన్నో విధాలుగా కుల,మతాలకు భేదం లేకుండా అందరికీ సమాన సుపరిపాలన అందిస్తున్నారని ఆయన తెలియజేశారు.ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే ఎన్నో సేవలను మారుమూల ప్రాంతాలకు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమం లో వైయస్సార్ కాంగ్రెస్ ఎస్టీ సెల్ మండల ప్రెసిడెంట్ భీమానాయక్,ఉప సర్పంచ్ రామాంజనేయులు, ఏఎన్ఎం పుష్ప మరియు ఆశావర్కర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

- Advertisement -

Tags:Viceroy eye light tests free of charge in villages

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page