చైనాలో మరో కొత్త వైరస్..

0 15

చైనా ముచ్చట్లు :

 

 

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన మరో కొత్త వైరస్ చైనాలో బయటపడింది. మంకీ బీగా పిలిచే ఈ కొత్త వైరస్‌తో చైనాలో ఓ శాస్త్రవేత్త మరణించడం కలకలం రేపుతోంది. కోతులపై పరిశోధనలు చేసే పశువైద్య నిపుణులు ఒకరు మంకీ బీ బారిన పడి మరణించారు. మంకీ బీ వైరస్ బయటపడేందుకు 1 నుంచి 3 వారాల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మంకీ బీ వైరస్ సోకితే ప్రధానంగా నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని గుర్తించారు. వైరస్ సోకితే 70 నుంచి 80 శాతం మంది మరణించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వారికి జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, విపరీతమైన అలసట వచ్చే ప్రమాదం ఉంది.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags: Another new virus in China ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page