జీవోలపై దమ్ముంటే ప్రమాణం చేయిండి

0 15

విజయవాడ ముచ్చట్లు:

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాబినెట్‌లోని కీలక మంత్రులపై సంచలన ఆరోపణలు చేశారు జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్. దేవదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్కామ్‌కి తెరలేపారని.. తాడేపల్లిలోని క్యాపిటల్ బిజినెస్ పార్క్‌‌కి లబ్ధి చేకూర్చేందుకు జీవో 61 తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. అందులోని నలుగురు పార్టనర్లు వెల్లంపల్లి పక్కనే ఉంటారని ఆయన అన్నారు. జీవో 61 ద్వారా వెల్లంపల్లి మిత్ర బృందానికి 30 కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చారని మహేష్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.ఇండస్ట్రియల్ కారిడార్‌లో లేని ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీకి కోసం జీవో ఇచ్చారని.. సీఎం దృష్టిలో లేకుండా పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జీవో తెచ్చారని మహేష్ ఆరోపించారు. ఇద్దరు మంత్రులు కలిసి కమిషన్ పంచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని మహేష్ తెలిపారు. విజయవాడ వస్త్రలత కాంప్లెక్స్‌ని ఖాళీ చేయాలని ఒత్తిడి చేయించి.. బిజినెస్ పార్క్‌కి తరలించాలని వెల్లంపల్లి చూస్తున్నారని మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రి వెల్లంపల్లికి ఈ వ్యవహారంతో సంబంధం లేదని దుర్గమ్మపై ప్రమాణం చేసి నిరూపించుకోవాలని మహేష్ డిమాండ్ చేశారు. జీవో 61తో కానీ.. జీవోతో లబ్ధి పొందిన వ్యక్తులతో సంబంధం లేదని దుర్గమ్మపై ప్రమాణం చేయాలని ఛాలెంజ్ విసిరారు. తప్పు చేయకుంటే ధైర్యంగా శుక్రవారం రోజు మంత్రి దుర్గమ్మ కొండకు రావాలని.. తాను కూడా వస్తానని ఆయన సవాల్ చేశారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Swear the guts on the creatures

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page