తెలంగాణా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు

0 13

హైదరాబాద్ ముచ్చట్లు:

ఆదివారం నాడు సముద్ర మట్టానికి 0.9 కి మీ ఎత్తు వద్ద ఏర్పడిన  ఉత్తర  దక్షిణ ద్రోణి, సోమవారం బలహీన పడింది.  తూర్పు – పశ్చిమ ద్రోణి/షేర్ జోన్ ఈ రోజు స్థిరంగా ఉండి,  సముద్ర మట్టానికి  4.5 కి మీ నుండి 5.8 కి మీ మధ్య కొనసాగుతూ  ఎత్తుకి వెళ్ళే కొలదీ దక్షిణ వైపుకి వంపు తిరిగి ఉన్నది. జులై 23న  వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం రాష్ట్రంలో   తేలికపాటి నుండి  మోస్తరు వర్షాలు, చాలా ప్రదేశములలో, రపు కొన్ని ప్రదేశములలో వచ్చే అవకాశాలున్నాయి.
వాతావరణ హెచ్చరికలు
మంగళవారం నాడు రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం పడే  అవకాశాలు ఉన్నాయి. రాగల 3 రోజులు ఉరుములు,  మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో ఒకటి రెండు ప్రదేశాలలో వచ్చే అవకాశాలున్నాయిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:Scattered rains in the state of Telangana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page