దేశంలో మొత్తం 326 దేశద్రోహం కేసులు నమోదు

0 6

న్యూఢిల్లీ    ముచ్చట్లు:
2014– 2019 మధ్యకాలంలో దేశంలో మొత్తం 326 దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. వీటిలో దేశద్రోహం ఆరోపణలకు వర్తించే ఐపీసీ 124ఏ సెక్షన్‌ కింద 141 కేసుల్లో చార్జ్‌షీట్‌ నమోదవగా, 6 కేసుల్లో మాత్రమే నేరం రుజువై, దోషులకు శిక్ష పడిందిమొత్తం 326 కేసుల్లో అత్యధికంగా 54 కేసులు అస్సాంలోనే నమోదయ్యాయి. అస్సాంలో 54 కేసులకు గానూ, 26 కేసుల్లో చార్జ్‌షీట్‌ నమోదు కాగా, 25 కేసుల్లో విచారణ ముగిసింది. అయితే, వీటిలో ఏ ఒక్క కేసులోనూ నేరం రుజువు కాలేదు. ఈ సెక్షన్‌ దుర్వినియోగమవుతోందని, బ్రిటిష్‌ వలస పాలన కాలం నాటి ఈ సెక్షన్‌ ఇంకా అవసరమా? అని ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

- Advertisement -

Tags:A total of 326 treason cases were registered in the country

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page