దేశ భద్రతకు పుంగనూరు సైన్యం – మంత్రి పెద్దిరెడ్డి

0 159

పుంగనూరు ముచ్చట్లు:

 

 

భారతదేశాన్ని కాపాడే ఆర్మీలో పుంగనూరు నియోజకవర్గంలోని యువకులను సైన్యంలో భాగస్వామ్యులను చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ , జేసిలు వీరబ్రహ్మం, రాజశేఖర్‌, ఓఎస్‌డి దుర్గాప్రసాద్‌, సబ్‌ కలెక్టర్‌ జహ్నావి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డితో కలసి ఆర్మీ ఉద్యోగాల ఎంపిక కార్యక్రమాన్ని మంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేసి , జ్యోతి వెలిగించి, పావురాలు ఎగురవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగులను సుమారు 500 మందిని ఆర్మీలోని వివిధ ఉద్యోగాలకు తొలి విడతగా పంపేందుకు ఎంపిక చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన స్కిల్‌డెవలెప్‌మెంట్‌ సంస్థ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. ఆర్మీ ఉద్యోగాలలో చేరిన వారి కుటుంబాలు ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నిరుద్యోగుల కోసం మంత్రి పెద్దిరెడ్డి చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఆర్మీలో చేరి , దేశరక్షణలో పుంగనూరు యువకులు చేరి, ఆదర్శవంతంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ పుంగనూరు ప్రజలు తమ కుటుంభాన్ని ఎంతగానో ఆదరిస్తున్నారని , ప్రజల రుణం తీర్చుకోలేమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్‌, పెద్దిరెడ్డి, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, సీఈవో ప్రభాకర్‌రెడ్డి, సెట్విన్‌ సీఈవో మురళికృష్ణ, డిఆర్‌డిఏ ప్రాజెక్ట్ మేనేజర్‌ సరితారెడ్డి, డిఫెన్స్అకాడమి ఇన్‌చార్జ్ శేషారెడ్డి, మంత్రి పిఏ మునితుకారాం, కమిషనర్‌ కెఎల్‌.వర్మతో పాటు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags: Punganur Army for National Security – Minister Peddireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page