పడమటి నియోజకవర్గాల సాగునీరు-తాగునీరుకు – మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

0 207

-కుప్పంకు తాగునీరు.

 

 

పుంగనూరు ముచ్చట్లు:

 

 

- Advertisement -

పడమటి ప్రాంత ప్రజలకు సాగునీరు-తాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహరెడ్డి గాలేరు ప్రాజెక్టును హెచ్‌ఎన్‌ఎస్‌కు అనుసంధానం చేసేందుకు రూ.5.050 కోట్లు , అలాగే రూ. 6800 కోట్లతో హంద్రీనీవా బ్రాంచ్‌కెనాల్‌ ద్వారా కుప్పంకు నీరు అందించేందుకు కాలువను వెడల్పు చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం పుంగనూరులో ఆర్మీ ఉద్యోగాల ప్రీ ఎంపిక కార్యక్రమాన్ని కలెక్టర్‌ హరినారాయణ్‌, సబ్‌కలెక్టర్‌ జహ్నావి , జేసిలు వీరబ్రహ్నం, రాజశేఖర్‌, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పడమటి నియోజకవర్గాలకు అవసరమైన నిధులు కేటాయిస్తూ , ముఖ్యమంత్రి తగిన ప్రణాళికలతో నిధులు విడుదల చేస్తున్నారని కొనియాడారు. ఇంటింటికి తాగునీరు-సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. కుప్పం ప్రజల కోసం గతంలో మంజూరు చేసిన పనులను అడ్డుకుని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుప్రీంకొర్టు వరకు కేసులు తీసుకెళ్లి, పనులు అడ్డుకున్నారని ఎద్దెవా చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయలేని పనులను కుప్పంలో చేపట్టి, వాటర్‌గ్రీడ్‌ ద్వారా కుప్పం ప్రజలకు ఇంటింటికి తాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని, దీనిని త్వరలోనే సాకారం చేస్తామని తెలిపారు. ఐదు సంవత్సరాల్లో అన్ని పనులు పూర్తి చేసి, దేశంలోనే ఏముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించి, ఆయన చిరకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రతి ఒక్కరు ఆశీర్వదించేలా పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జానపదకళల అభివృద్ధి సంస్థచైర్మన్‌ నాగభూషణం , ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్‌, పెద్దిరెడ్డి, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, నాగరాజారెడ్డితో పాటు ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ పాల్గొన్నారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Irrigation and drinking water of western constituencies – Minister Dr. Peddireddy Ramachandrareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page