పాకిస్థాన్ లో రోడ్డు ప్రమాదం.. 27 మంది మ‌ృతి

0 11

ఇస్లామాబాద్ ముచ్చట్లు :

 

 

పాకిస్థాన్ దేశంలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 27 మంది మరణించగా, మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ దేశంలోని ఇండస్ జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ప్రయాణికుల బస్సు ట్రక్కును ఢీకొంది.సాయల్ కోట్ నుంచి రాజాన్ పూర్ కు వెళుతున్న ప్రయాణికుల బస్సు డేరా ఘాజీ ఖాన్ ఏరియా వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు మరణించారని కమిషనర్ డాక్టర్ ఇర్షాద్ అహ్మద్ చెప్పారు. గాయపడిన 40 మందిని ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈదుల్ అజాహా పండుగ కోసం స్వగ్రామానికి వస్తుండగా ఈ బస్సు ప్రమాదం జరిగింది.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Road accident in Pakistan .. 27 dead

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page