పుంగనూరులో ఆర్మీలో చేరేందుకు పరుగులు తీస్తున్న యువత

0 275

పుంగనూరు ముచ్చట్లు:

 

 

దేశ సరిహద్దుల్లో పని చేసేందుకు యువత సోమవారం పరుగులు తీశారు. ఆర్మీ ఉద్యోగాల కోసం పుంగనూరు నియోజకవర్గంలోని నిరుద్యోగులను ఆర్మీలోని ఉద్యోగాలకు పంపేందుకు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సుమారు మూడువేల మంది యువకులకు అధికారులు అన్ని రకాల పరీక్ష లు నిర్వహించారు. ఈ పోటీలలో సుమారు 500 మందిని ఎంపిక చేశారు. వీరికి తిరుపతిలోని ఎస్వీడిఫెన్స్ అకాడమిలో నెల రోజుల పాటు సిల్క్డెవలెప్‌మెంట్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలకు పంపనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఓఎస్‌డి దుర్గాప్రసాద్‌, సీఈవో ప్రభాకర్‌రెడ్డి, సెట్విన్‌ సీఈవో మురళికృష్ణ, డిఫెన్స్అకాడమి ఇన్‌చార్జ్ శేషారెడ్డి, మంత్రి పిఏ మునితుకారాం, కమిషనర్‌ కెఎల్‌.వర్మతో పాటు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Young men running to join the Army in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page