ప్రజలు, వ్యాపారస్తుల సహకారానికి కృతజ్ఞతలు మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు

0 9
కెటి రోడ్డులు విస్తరణ పనులు స్వయంగా పరిశీలించిన మంత్రి
మూడు రోడ్లు కూడలి నుండి ఇందిరా చౌక్ వరకు కాలి నడకన  పనులు పరిశీలన
పలాస ముచ్చట్లు:
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కెటి రోడ్డు విస్తరణకు సహకరిస్తున్న వ్యాపారస్తులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం స్థానిక కాశీబుగ్గ మూడు రోడ్లు కూడలి నుండి పలాస ఇందిరా చౌక్ వరకు రోడ్డు పనులు పరిశీలించారు. రాష్ట్ర మంత్రి స్వయంగా కాలి నడకన నడుచుకుంటూ దుకాణు దారులతో మాట్లాడుతూ ముందుకు సాగారు. కెటి రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాకు ,ఇళ్లు ప్రభుత్వ నిబందనలను అనుసరిస్తూ పనులు జరుగుతుండటం చూశారు. 80 అడుగుల విస్తీర్ణంతో కెటి రోడ్ ఆధునీకరణ చేయడం జరుగుతుందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఇరుకు రోడ్లుపై ట్రావెల్ చేయడం ఇబ్బందులకు గురికావడం జరుగుతుందని. పలాస నియోజకవర్గంలో పలాస కాశీబుగ్గ పట్టణం మూడు మండలాల ప్రజలకు ఎంతో అవసరమైన పట్టణం అని తెలిపారు. వాస్తవంగా పలాస కాశీబుగ్గ   మున్సిపాలిటీలో  రోడ్లు అభివృద్ధి చెందితే పట్టణాన్ని సుందరంగా మార్చుకునే అవకాశం ఉందని అన్నారు. మన పట్టణం మనం అభివృద్ధి చెందే దిశగా పనులు ప్రారంభంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వచ్చందంగా పనులు చేయడం చూస్తే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అభివృద్ధికి అందరూ భాగస్వామ్యం కావడం ఇది శుభపరిణామం అని చెప్పారు. పలాస నియోజకవర్గంలో మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలతో పాటు పలాస కాశీబుగ్గను సమూలంగా అభివృద్ధి చేసుకుని సుందర పట్టణంగా మార్చుతానని ప్రజలకు హామి ఇచ్చారు. ప్రజల నిత్యవసరాలకు నిత్యం పలాస కాశీబుగ్గ పట్టణంకి రాక పోకలు సాగిస్తారని రోడ్లు విస్తీర్ణం కావడంతో ట్రాఫిక్ సమస్యల నుండి బయట పడతామని అన్నారు. పలాస కాశీబుగ్గ కెటి రోడ్డు విస్తరణ లో భాగంగా ముందుగా డ్రైనేజి, పుట్ పాత్ నిర్మాణానికి పూర్తి స్థాయి నిధులు మంజూరు చేయించుకున్నామని తెలిపారు. రోడ్డు నిర్మాణానికి వీలైనంత విస్తీర్ణం వరకు అడ్డంకులు తొగించిన వెంటనే డ్రైనేజి, పుట్ పాత్ నిర్మాణం కూడా చేపడతామని అన్నారు. ప్రజలు ఎంతగా సహకరిస్తే అంత వేగం అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉందని అన్నారు. ఏది ఏమైనా ప్రజలు, వ్యాపారుల మద్దతు పూర్తిస్తాయిగా ఉందని స్వచ్చందంగా విస్తరణ పనులలో కట్టడాలను తొలిగించడం చూస్తే వారందరికి    రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ, ఆర్ అండ్ బి సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బందు, తోపాటు వైసిపి నాయకులు,కౌన్సిలర్లు పలువురు పాల్గొన్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Thanks to the cooperation of the people, the businessmen
Minister Dr. Sidiri Appalaraju


Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page