ప్రజల సమస్యల పరిష్కారం కోసమే స్పందన నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

0 7

నంద్యాల  ముచ్చట్లు:
ప్రజల సమస్యల పరిష్కారం కోసమే స్పందన కార్యక్రమము నిర్వహించు తున్నాము. ప్రజలు సద్వినియొగం చేసుకోవలని నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్  అన్నారు.
సోమవారం నంద్యాల సబ్ కలెక్టర్  కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో  నంద్యాల సబ్ కలెక్టర్, సబ్ కలెక్టర్ కార్యాలయం  పరిపాలన అధికారి హరినాథ్ రావు లతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు.
అనంతరం నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ  సోమవారం రోజు నంద్యాల సబ్ కలెక్టర్  కార్యాలయంలో స్పందన కార్యక్రమం లో భాగంగా నంద్యాల రెవెన్యూ డివిజన్ నలుమూలల  నుండి వచ్చిన వినతులను స్వీకరించామన్నారు. నంద్యాల రెవెన్యూ డివిజన్ లోని 17 మండల తహసిల్దార్  వారి కార్యాలయంలలో ప్రతి సోమవారం నిర్వహించే  స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వినతులను స్వీకరించడం జరుగుతుందన్నారు. మన  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ వ్యవస్థలో క్షేత్రస్థాయిలో కూడ వినతులు స్వీకరించబడు తాయి అని అన్నారు. వినతి దారులు సచివాలయాల్లో. తహసీల్దార్ కార్యాలయాల్లో. సమస్యలు లు పరిష్కారం కానప్పుడు రెవిన్యూ డివిజనల్ ఆఫీసు కు రావాలన్నారు. సోమవారం జరిగిన స్పందన కార్యక్రమం లో ఎక్కువ శాతం భూముల సర్వే చేయించాలని. భూములను ఆక్రమించారని. భూములు ఆన్లైన్లో నమోదు చేయించాలని.  పరం పోగు భూముల్లో పట్టాదారు పాసు పుస్తకాలు కావాలని.  ప్రభుత్వం ఇచ్చినటువంటి  గృహాలను ఆక్రమించుకున్నారు.  పంట భూములకు రస్తా కావాలని. నంద్యాల మండలం బాబూజీ నగర్ గ్రామంలో స్మశానవాటిక కు స్థలం కావాలని. నంద్యాల మండలం బిల్లా పురం గ్రామం లో రోడ్డు నిర్మాణం కొరకు  ఎలాంటి నోటీసు లేకుండా మా భూములను ఆక్రమించుకున్నారు అని. తెలుపుతూ వినతులు అందాయన్నారు. సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి దాదాపుగా.24 వినతులు  అందినవని ఆమె అన్నారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

- Advertisement -

Tags:The response is to solve people’s problems
Nandyala Sub Collector Chahat Bajpayee

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page