బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలి

0 9

కామారెడ్డి ముచ్చట్లు:

బృహత్ పల్లె ప్రకృతి వనం లో ఈ నెల 24 నుంచి మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ ఆదేశించారు. కలెక్టరేట్ లోని మీటింగ్ హాలులో సోమవారం మండల స్థాయి అధికారులతో హరితహారం పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,  ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని 22 మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని,10 ఎకరాల స్థలం కేటాయించాలని కోరారు. ఉసిరి, చింత, పనస, జామ, దానిమ్మ, వెదురు, తాటి మొక్కలు నాటాలని పేర్కొన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనానికి  ఒకరు చొప్పున అటవీ అధికారులను నియమించినట్లు చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్ లో రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలు సంరక్షణ చేపట్టాలని సూచించారు. కొత్త రోడ్లపై ఈనెల 25 లోగా అవెన్యూ ప్లాంటేషన్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరారు. 44 నెంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటడానికి కావలసిన కూలీలను ఉపాధిహామీ అధికారులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలోజిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్  ధోత్రే, జిల్లా ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు, డి పి ఓ సునంద, ఏపీడి సాయన్న, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Large rural nature parks should be established

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page