భూతగాదాలతో వ్యక్తి నిర్బంధం

0 9

రాజన్న సిరిసిల్ల  ముచ్చట్లు:
భూ తగాదాల తో ఓ వ్యక్తిని తాళ్లతో కట్టి పడేసిన వైనం తంగళ్ళపల్లి మండలం దేశాయి పల్లె గ్రామంలో చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళితే గట్టు లింగారెడ్డి కి సంబంధించిన 350 సర్వేనెంబర్ లో ఉన్న ఇరవై ఏడు గుంటల వ్యవసాయ భూమిని సాదాబైనామా పేరుతో,పంజా బాలరాజుకు సంబంధించిన 349 సర్వేనెంబర్ లో ఉన్న నాలుగు గుంటల భూమిని గట్టు కిషన్ రెడ్డి తన పేరిట చేసుకున్నాడు. ఈ విషయమై గత కొన్ని రోజులుగా గట్టు లింగారెడ్డి, పంజా బాలరాజు, గట్టు కిషన్ రెడ్డి లకు గొడవ జరుగుతుంది. తమ భూమిని తమకు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా కిషన్ రెడ్డి చేయడం లేదని బాధితులు తెలిపారు. కిషన్ రెడ్డి కేసులు పెడుతూ, బెదిరింపులకు గురి చేస్తూ పొలం వెంబడి నడవనియడంలేదని అన్నారు.చేసేదేమీలేక అడిగి, అడిగి విసుగుచెంది ఈరోజు పొలం దగ్గర గట్టు కిషన్ రెడ్డిని తాళ్లతో కట్టేసి,బోరు ఫీజులు తీసివేయడం జరిగింది అని గట్టు లింగారెడ్డి తెలిపారు. 30 ఏళ్లుగా సాగులో ఉన్నామని,ఇకనైనా మా భూమి మాకు చేయాలంటూ బాధితులు తెలిపారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

- Advertisement -

Tags:Individual detention with exorcisms

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page