మీడియా పైదాడిని కండిస్తు నేలకొండపల్లిలో ధర్నా తహశీల్దార్ కి మెమోరాండం 

0 8

ఖమ్మం ముచ్చట్లు:

తెలంగాణా ఉద్యమం లో ముఖ్య భూమిక పోషించిన మీడియాపైనే  అధికార పార్టీ దాడులు ఏమైనా చర్య అని, మీడియా పై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో  పాత్రికేయులు నిరసన తెలిపారు. సూర్యపేట జిల్లా హుజూర్నగర్ లో రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిబేట్ కార్యక్రమంలో హుజూర్ నగర్ స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరులు డిబేట్ నిర్వహిస్తున్న మీడియా విలేకరులపై దాడికి పాల్పడిన అధికారపార్టీ ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరుల పై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నేలకొండపల్లి ప్రధాన సెంటర్ నుంచి స్థానిక తాసిల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.నేలకొండపల్లి తాసిల్దార్ సుమ కు వినతి పత్రం అందజేశారు. మీడియాపై దాడులను ఖండిస్తూ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ ,బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొని మీడియా పై అధికార పార్టీ నాయకుల దాడిని ఖండిస్తూ మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో మీడియా పాలేరు నియోజకవర్గ రిపోర్టర్లు పొలం పల్లి నాగేశ్వరరావు, గొలుసు ఆంజనేయులు, రేగురి శ్రావణ్ కుమార్, తక్కినవీటి అరుణ్ కుమార్, వనం అచ్యుత రామారావు,గంధం రామచందర్రావు, మోర సైజులు, నున్న లక్ష్మణ్, కాంగ్రెస్ బిజెపి నాయకులు, బొడ్డు బొందయ్య, మామిడి వెంకన్న, జెర్రిపోతుల అంజని ,నాగరాజు మన్నే కృష్ణారావు ,ఎస్ కె షరీఫ్ ఉద్దీన్ లు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:Dharna in Nelakondapalli condemning the media attack
Memorandum to Tahsildar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page