ముగిసిన సీఎం జగన్ పోలవరం పర్యటన

0 10

ఏలూరు  ముచ్చట్లు:
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పోలవరం పర్యాటన ముగిసింది.  పోలవరం పనుల ప్రగతి పై అధికారులతో సమీక్ష సమావేశం సీఎం నిర్వహించారు. స్పిల్వే పనులు దాదాపుగా పూర్తిచేశామన్న 48 గేట్లలో 42 గేట్లు అమరిక, మిగిలిన గేట్లను  త్వరలోనే బిగిస్తామని అధికారులు తెలిపారు. 2022 జూన్కల్లా లైనింగ్తో కలుపుకుని రెండు కాల్వలకు లింకు పనులు పూర్తికావాలని, టన్నెల్పనులు, లైనింగ్పనులు పూర్తికావాలని సీఎం ఆదేశించారు. డిసెంబర్కల్లా తవ్వకం పనులు పూర్తవుతాయని, ఆతర్వాత మిగిలిన పనులు పూర్తిచేస్తామని అధికారులు వెల్లడించారు. మొత్తం 90 ఆవాసాల్లో ఆగస్టునాటికి 48 ఆవాసాలనుంచి నిర్వాసితులను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎంకు వివరించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలవరం ఆర్ అండ్ ఆర్ పనులన్నీ పూర్తి నాణ్యతతో ఉండాలి. ఆర్ అండ్ ఆర్ పనుల్లో నాణ్యత కచ్చితంగా పాటించేలా ఒక అధికారిని నియమించాలి అనీ సీఎం జగన్ ఆదేశించారు. కొంత డబ్బు ఎక్కువ ఖర్చుపెట్టినా సరే, నాణ్యత మాత్రం తప్పకుండా పాటించాలని అన్నారు. పునరావాస కాలనీల్లో నిర్వాసితులు జీవితాంతం ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు.కాలనీల నిర్మాణంతోపాటు.. సమాంతరంగా మౌలిక సదుపాయాల కల్పన కూడా జరగాలని అయన అన్నారు.  పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి దాదాపుగా రూ.2300 కోట్లు రావాల్సి ఉన్నా… పనులకు ఎక్కడా ఆటంకం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులను ఇస్తోందని సీఎం అన్నారు. వచ్చే నెల ఆర్ అండ్ ఆర్ కాలనీలను సందర్శిస్తానని తెలిపారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

- Advertisement -

Tags:CM Jagan Polavaram’s visit ended

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page