రేవంత్‌రెడ్డి గృహనిర్బంధం పార్లమెంట్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారని స్పీకర్‌కు రేవంత్ ఫిర్యాదు

0 9

హైదరాబాద్‌  ముచ్చట్లు:
రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శన, ధర్నాకు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.తెల్లవారుజామున మూడు గంటల నుంచే రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి మకాం వేశారు.
ఇది నియంతృత్వానికి పరాకాష్ఠ: మల్లు రవి
పార్లమెంట్‌లో కోకాపేట భూముల అవినీతిని ఎండగడతారనే భయంతోనే కాంగ్రెస్‌ నేతలను అడ్డుకుంటున్నారని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. ఇది అప్రజాస్వామికమని.. ఇంత దుర్మార్గం ఎక్కడా చూడలేదన్నారు. ఈ నియంత పాలనకు, అవినీతి పాలకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని చెప్పారు.
పార్లమెంట్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారని స్పీకర్‌కు రేవంత్ ఫిర్యాదు
పార్లమెంట్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారని స్పీకర్‌కు ఎంపీ రేవంత్ ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయంలో రేవంత్‌రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు వివరణ ఇస్తూ.. పార్లమెంట్‌కు వెళ్లకుండా అడ్డుకునే ఉద్దేశం మాకు లేదని,  రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్లడాన్ని మేం ఎక్కడా అడ్డుకోలేదని తెలిపారు.రేవంత్‌రెడ్డిసోమవారంకోకాపేటభూములసందర్శనకు వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ రోజు తెల్లవారుజామున నుంచి ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మొహరించి రేవంత్‌రెడ్డిని గృహ నిర్బంధం చేసిన సంగతి తెలిసిందే…

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

- Advertisement -

Tags:Rewanth complained to the Speaker that the house arrest prevented him from going to Parliament

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page