రైతు చైతన్య యాత్రలో పాల్గొన్న ఏ వో బాలకృష్ణ నాయక్

0 5

దర్శి  ముచ్చట్లు:
ప్రకాశం జిల్లా దర్శి మండలం లో సోమవారం  దర్శి మండలం వ్యవసాయధికారి చందలూరు ,   వేంకటా చలం పల్లి గ్రామాలకు చెందిన రైతులకు బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో చందలూరు  రైతు భరోసా కేంద్రం లో రైతు భరోసా చైతన్య యాత్రలను నిర్వహించడం  జరిగింది .ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ  అధికారి బాలకృష్ణ నాయక్  మాట్లాడుతూ వ్యవసాయ శాఖలో ఉన్న వివిధ పథకాల గురించి వివరిస్తూ రైతులు వేసిన పంటలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పంట నమోదు చేసుకొనవలెను అని, దీనివల్ల కలుగు ప్రయోజనాలు గురించి వివరించడం అయినది. అలాగే కౌలుకు వేసే రైతులు కౌలుదారు కార్డులు పొందవలెనని వాటి యొక్క ప్రయోజనాల గురించి వివరించారు. రైతు భరోసా కేంద్రం లో జరుగు ప్రయోజనాల గురించి వివరిస్తూ ఎరువులు, పురుగు మందులు ,విత్తనాలను గ్రామంలోనే అందుబాటులో  ఉన్నాయని తెలియజేసినారు.
విత్తనాలు కావాల్సిన వారు రైతు భరోసా కేంద్రం లో నమోదు చేసుకోవాలని, రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల భూమి యొక్క సారం తగ్గిపోయి ఎందుకు పనికిరాకుండా పోతున్నాయని కావున ప్రతి రైతు తగిన మోతాదులో మాత్రమే ఎరువులను వాడవలెను. అని తెలియజేశారు.
ఉద్యానవన అధికారి ఆది రెడ్డి  మాట్లాడుతూ ఉద్యాన శాఖ లో ఉన్నటువంటి వివిధ పథకాల గురించి వివరిస్తూ మిరప పంటను వేసే రైతులు విత్తనాలు ఎంపిక విషయంలో జాగ్రత్తలు వహించాలని, ప్రతి రైతు నీటి కుంటలు కూడా ఏర్పాటు చేసుకోవాలని, ఫార్మ్ పొండ్ , శాశ్వత పందిర్లు ,కొత్తగా వేస్తున్న పండ్ల,కూరగాయల,పూల తోటలు వేసే రైతులు ప్రస్తుతం ప్రభుత్వ రాయితీ కోసం రైతు భరోసా కేంద్రం ద్వారా ధరకాస్తు చేసుకోవాలని , మరియు వివిధ పదకాల గురించి  కూడా వివరించారు .
పశుసంవర్ధక శాఖ డాక్టర్ శ్రీమన్నారాయణ  మాట్లాడుతూ పశువులకు వచ్చే వ్యాధులు వాటి నివారణ చర్యలు గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి,  పశుసంవర్ధక శాఖ లోని వివిధ పథకాల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో దర్శివ్యవసాయ శాఖ అధికారి బాల క్రిష్ణ నాయక్ ,ఉద్యాన శాఖ అధికారి   పి.ఆదిరెడ్డి, చందలూరు వి హెచ్ ఏ        డి . జాన్ గార్డెన్ , వేంకటాచలం పల్లి   వి ఏ ఏ  సోమ్లా నాయక్ , పశు సంవర్ధక శాఖ సిబ్బంది , గ్రామ  సర్పంచ్ లు , రైతులు సోదరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

- Advertisement -

Tags:A Wo Balakrishna Nayak who participated in the Raitu Chaitanya Yatra

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page