వర్షంలోనూ పంటలను వదలని ఏనుగులు

0 17

పలమనేరు ముచ్చట్లు:

 

వర్షం కురుస్తున్నా రాత్రంతా ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి ద్వంసం చేసినట్లు పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల మనేరు రూరల్ మండలంలోని మొసలిమడుగు, ఏటిగడ్డ గ్రామాలకు సమీపంలోని పంటలపై 20ఏనుగు ల గుంపు వ‌ర్షం కురుస్తున్నా రాత్రంతా స్వైర విహారంచేసి పలు రకాల పంటలను ద్వంసం చేశాయని అధి కారులు ఫిర్యాదు చేశామని రైతులు పేర్కొన్నారు. మొసలిమడుగు గ్రామానికి ఆనుకుని వున్న రవీద్రారెడ్డి ఇంటి పక్కన మిరప పంటను తొక్కి నాశనం చేశాయి. అలాగే రాజమ్మకు చెందిన రాగి, వంగ, ఉమాపతినాయుడుకు చెందిన మామిడితోట,మొక్కజొ న్న పంటలను ద్వంసం చేశాయని వాపోయారు. ఇంద్రానగర్ గ్రామాలకు చెందిన పలువురు రైతులకు చెందిన ఉలవ పంటలను తొక్కి నాశనం చేశాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఏనుగులకు ఆశించిన మేత లేకపోవడంతో మొక్కజొన్న పశుగ్రాసాన్ని పూర్తిగా ద్వంసం చేశాయని వాపోయారు. ఇదిలా వుండగా అటవీ సమీపంలోని కౌండిణ్యానదికి ఇరువైపులా అమర్చిన సోలార్ ఫెన్సింగ్ ను ద్వంసం చేసి అడవిలోకి వెళ్ళిపోయాయని పేర్కొన్నారు. ఇలా ప్రతి నిత్యం సమీప గ్రామాల్లో ఏనుగులు రైతుల పంట పొలాలపై దాడులు చేసి ద్వంసం చేశాయని వాపోతు న్నారు. పంటనష్టాలకు ప్రభుత్వం అంతంతమాత్రమే నష్టపరిహారం అందిస్తోందన్నారు. అదికూడా నెలలు గడుస్తున్నా మంజూరు కాలెదని వాపోతున్నారు. పెట్టుబడులకు లక్షలాది రూపాయలు అప్పులుచేశామని, పంటలను ఏనుగులు ద్వంసం చేయడంతో వడ్డీలు కూడా చెల్లించ లేక పోతున్నారని వాపోయారు. పగటిపూట కోతులు, రాత్రిపూట ఏనుగుల బెడద తీవ్రంగా ఉందన్నారు. పంట నష్టాలకు తగిన పరిహారం అందక రైతులు అప్పుల పాలవుతున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Elephants that do not leave crops even in the rain

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page