సింగీతంలో బీజేపీ కార్యాలయం ప్రారంభం

0 8

నిజామాబాద్  ముచ్చట్లు:
నిజామాబాద్ జిల్లా  సింగీతం గ్రామం లో బీజేపీ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే,జుక్కల్ బీజేపీ పార్టీ ఇంచార్జి అరుణ తార. జండా ఆవిష్కరణ కార్యక్రమం లో జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షురాలు అరుణ తార తో పాటు జిల్లా బీజేపీ పార్టీ ఇంచార్జి బద్దం మహిపాల్ రెడ్డి, బాన్స్ వాడ బీజేపీ పార్టీ ఇంచార్జి మాల్యాద్రి రెడ్డి ఉన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామానికి చెందిన 100 మంది యువకులు,పెద్దలు బీజేపీ పార్టీ కండువా కప్పు కొని బీజేపీ పార్టీ లో చేరారు.అనంతరం నిజాంసాగర్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం లోని సింగీతం గ్రామంలో జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షురాలు అరుణ తార ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ జండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామానికి చెందిన సుమారు 100 మంది బీజేపీ పార్టీ లో చేరారు.ఈ సందర్భంగా మాట్లాడిన జుక్కల్ బీజేపీ పార్టీ ఇంచార్జి అరుణ తార తనను ఎమ్మెల్యే గా గెలిపిస్తే గ్రామంలోని సమస్యలన్నీటిని తీర్చుతానని హామీ ఇచ్చారు. దృఢ సంకల్పంతో మండలం లోని బీజేపీ కార్యకర్తలు ముందుకు వెళ్ళాలని అన్నారు.మండలంలోని బీజేపీ కార్యకర్త లకు ఇబ్బందులను కలుగజేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తుల చిట్టా తీసి ఇజ్జత్ పంచనామా చేస్తానని అన్నారు అనంతరం మాట్లాడిన జిల్లా బీజేపీ పార్టీ ఇంచార్జి బద్దం మహిపాల్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు వచ్చిన బీజేపీ పార్టీ కండువాను వీడవద్దని సూచించారు.తెలంగాణ అమరవీరుల,స్వతంత్ర సమర యోధుల ఎదుర్కొన్న నొప్పి ముందు మనం ఎదుర్కొనే ఇబ్బందులు చాలా చిన్నవని అన్నారు.బీజేపీ కార్యకర్తలకు మద్దతుగా తాము నిత్యం ఉంటామంటూ భరోసా కల్పించారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

- Advertisement -

Tags:BJP office start in music

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page