సిల్వర్ స్క్రీన్ ఇంకా కష్టాలే

0 12

హైదరాబాద్ ముచ్చట్లు :

 

థియేటర్లలో  బొమ్మ పడి మూడు నెలలు గడిచింది.. ఇప్పటి దాకా స్క్రిన్ వెలగలేదు,  సౌండ్ దద్దరిల్లలేదు.. కరోనా వల్ల నానాటికి ఆర్థికంగా చితికి పోతున్న ఎగ్జిబిటర్ల  విన్నపానికి స్పందించిన సర్కార్  రీల్స్ దుమ్ము దులపొచ్చు.. థియేటర్లలో బొమ్మ వేసుకోవచ్చు అంటూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది.. ఉత్తర్వులు అయితే వచ్చాయి, మరి థియేటర్లు ఓపెన్ అయ్యాయా..? మహాన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం.కరోనా రెండో దశ పంజా విసరడంతో థియేటర్లతో పాటు రద్దీ ఉండే ప్రాంతాలన్నింటిపైన సర్కార్ ఆంక్షలు విధించింది.. దింతో  సినిమా థియేటర్ తలుపులు మూడు నెలలుగా మూసుకునే ఉన్నాయి.. ఎట్టకేలకు ఆంక్షలు ఎత్తివేసి నేటితో థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన హైదరాబాద్ ఏ ఒక్క థియేటర్ ఓపెన్ కాలేదు.. ఏ ఒక్క థియేటర్ లోను బొమ్మ పడలేదు.  ప్రస్తుతం సినిమాలేవి లేకపోవడం వల్ల థియేటర్లలో ఎక్కడ  సినిమాలు ఆడలేదు.. ఈ నెలాఖరలో సినిమాలు రిలీజ్ అవుతు ఉండటంతో ఆ సమయానికి థియేటర్లను సిద్ధం చేసుకుంటామని అంటున్నారు యజమానులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మల్టీఫ్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా ప్రదర్శనలు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

 

 

- Advertisement -

పూర్తిగా వందశాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లు నడిపించుకోవచ్చని చెప్పింది..  మరోవైపు పెయిడ్ పార్కింగ్ కు అనుమతి, కరెంట్ బిల్లులు, ట్యాక్స్ లు తగ్గించాలని ప్రభుత్వానికి ఫిల్మ్ ఛాంబర్ విన్నవించుకున్న సందర్భంలో ఈ అంశంపై  నెలాఖరు వరకు ప్రభుత్వం నుండి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.. దింతో అన్ని థియేటర్లలో  ఈ నెలాఖరు బొమ్మ పడే అవకాశం లేదు. కరోనా సినిమా రంగాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది .  చిత్ర పరిశ్రమ తో పాటు సినిమాల పైనే ఆధారపడిన థియేటర్లు సుమారు ఐదు వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయాయి..  వరుసగా సినిమాలు విడుదల అయితే తప్ప థియేటర్లు నష్టాల బారి నుండి గట్టెక్కేలా లేవు.  మొత్తానికి ప్రభుత్వం  థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన  ఒక్క థియేటర్ కూడా ఓపెన్ అవ్వలేదు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: The silver screen is still hard

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page