25న అప్ప‌లాయ‌గుంటలోని శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం

0 5

తిరుపతి ముచ్చట్లు:

 

 

అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్ర‌స‌న్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 25వ తేదీన పుష్పయాగ మహోత్సవం జ‌రుగ‌నుంది. ఇందుకోసం జూలై 24వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు మేదినిపూజ‌, సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్పణం నిర్వ‌హిస్తారు.జూలై 25వ తేదీ ఉదయం 10.30 గంటలకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం నిర్వ‌హిస్తారు. పుష్పయాగంలో వివిధ రకాల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తారు.ఈ ఆల‌యంలో జూన్ 19 నుండి 27వ తేదీ వరకు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంద‌ని అర్చ‌కులు తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Wreath-laying ceremony of Sri Prasanna Venkateswaraswamy at Appalayangunta on the 25th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page