అర్హులైన వారందరికీ జగనన్న గోరుముద్ద పథకం

0 9

జగన్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ద్యేయం
రామన్న గౌడ్

కౌతాళం    ముచ్చట్లు:

- Advertisement -

మండల పరిధిలో   నదీచాగి గ్రామంలోని మండల పరిషత్ ఆదర్శ కన్నడ పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న గోరుముద్ద కార్యక్రమం లో భాగంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు గ్రామ నాయకులు  రామన గౌడ్ సహకారంతో పాఠశాల చైర్మన్ మరియు సర్పంచ్ చేతుల మీదుగా ప్రతి విద్యార్థికి నాలుగున్నర కిలోల చొప్పున కందిపప్పు పంపిణీ చేయడం జరిగింది, పాఠశాల లో ఉన్న 247 పిల్లలకు గాను 204 మంది పిల్లలకు కందిపప్పు సరఫరా చేయడం జరిగింది మిగతా 43 పిల్లలకు తొందరలో కందిపప్పు పంపిణీ చేస్తామని పాఠశాల ముఖ్య ఉపాధ్యాయులు  తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మాజీ ఎంపిటిసి ఈశప్పగౌడ్ మాట్లాడుతూ  నాడు నేడు  కింద  25 లక్షల ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్ది పిల్లల కోసం తాగునీటి ఆర్ ఓ ప్లాంట్ ను మరియు ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి ప్రతి గదికి నాలుగు ఫ్యాన్లు 4 ట్యూబ్ లైట్లను ఏర్పాటు చేసి అన్ని  సౌకర్యాలను ఏ పట్టు చేయడం జరిగిందని మరియు ఇంకా పాఠశాలకు ఏలాంటి అవసరం ఉన్న  రామన గౌడ్ సహకారంతో వెళ్తామని దీనికి ముఖ్య ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రామన్న గౌడ్, సర్పంచ్, ఉపాద్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:Jagannath Nail Scheme for all those who are eligible

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page