ఆచితూచి ప్రారంభించండి

0 15

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

కరోనా రెండో దశ వ్యాప్తి పీడకలలు మర్చిపోకముందే థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల తెరవడంపై ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాల్లో పాఠశాలలు తెరవాలని ఆయన సూచించారు. అయితే, పూర్తిస్థాయిలో కాకుండా పాక్షికంగా తెరవాలని పేర్కొన్నారు.ఇలా చేయడం వల్ల పెద్దగా సమస్య ఉండదన్న ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయనే సంకేతాలు వస్తే వెంటనే పాఠశాలలను మూసివేయాలని అన్నారు. దేశంలో పిల్లలు ఇప్పటికే చాలా వరకూ కరోనా బారినపడ్డారని… దీంతో వారిలో వ్యాధినిరోధశక్తి పెరిగిందని వివరించారు. విద్యార్థుల మానసిక వికాసానికి చదువు చాలా అవసరమని.. అందుకే స్కూళ్లు తెరవడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. చాలా కాలంగా పాఠశాలలు మూసివేయడం వల్ల పిల్లలపై ప్రతికూలంగా ప్రభావం చూపుతోందని అన్నారు.మాస్క్‌లు, భౌతికదూరం వంటి నిబంధనలు పాటించడ తప్పనిసరని పేర్కొన్నారు. థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది అపోహలేనని ఇటీవల ఎయిమ్స్ సర్వేలో వెల్లడైన విషయం తెలిసిందే. ఈ అంశంపై గులేరియా మాట్లాడుతూ.. సెప్టెంబరు నాటికి పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పిల్లలపై జరుగుతున్న కొవాగ్జిన్ టీకా ట్రయల్స్‌లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. అన్నీ సక్రమంగా జరిగితే సెప్టెంబరు నాటికి రెండేళ్ల చిన్నారులు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చని పేర్కొన్నారు.కోవిడ్ -19 సమయంలో ఇంటర్నెట్ సౌకర్యాల అంతరాలను తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు. క్షేత్రస్థాయిలో డిజిటల్ అంతరాలు జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయని గులేరియా అన్నారు. ‘పాఠశాలల ప్రారంభానికి దూకుడుగా పనిచేయాలని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను.. ఎందుకంటే ఇది యువతరాన్ని ముఖ్యంగా ఆన్‌లైన్ తరగతులకు హాజరుకాలేని అట్టడుగున ఉన్నవారిపై జ్ఞానం పరంగా ప్రభావితం చేసింది’ అని గులేరియా జూన్‌లో వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

TAgs:Start with achituchi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page