ఇంకా ధరణి ఇబ్బందులే…

0 14

హైదరాబాద్     ముచ్చట్లు:

 

ధరణితో సమస్యలు తీరడం లేదు. పరిష్కారాలు దొరకడం లేదు. భూముల సమస్యల పరిష్కారానికి పోర్టల్ లో ఆప్షన్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఫిర్యాదులు తీసుకోవడంతోనే సరిపెడుతోంది. సమస్యలను పరిష్కరించడం లేదు. ఒక్కో రైతు మూడు, నాలుగు సార్లు దరఖాస్తు చేసినా ఇదే పరిస్థితి. ధరణి పోర్టల్‌లోని గ్రీవెన్సెస్ ల్యాండ్ మ్యాటర్స్ మాడ్యుల్ ద్వారా రోజూ 500 దరఖాస్తులు వస్తున్నా.. కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఇవన్నీ పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ప్రతి అప్లికేషన్ కలెక్టర్ల లాగిన్‌లోకి వెళ్తుందని, సమస్యను బట్టి అక్కడి నుంచి ఎమ్మార్వో కు ఫార్వర్డ్ అవుతుందని చెప్పడమే తప్ప చేస్తున్నదేమీ లేదు. ఇప్పటికే పలు రకాలుగా భూ సమస్యలపై అప్లికేషన్లు పెట్టుకున్నామని, అసలు వాటి స్టేటస్ ఏంటో కూడా అధికారులు చెప్పడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరణి పోర్టల్లో స్టేటస్ తెలుసుకునేందుకు అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేస్తే.. నంబర్ వ్యాలిడ్ కాదని వస్తోందని, ఎమ్మార్వో ఆఫీసుకు వెళితే కలెక్టర్ పేరు చెప్పడం, అక్కడికి వెళితే తమకు సీసీఎల్‌ఏ నుంచి, సర్కారు నుంచి ఇంకా ఆర్డర్స్ రాలేదని సమాధానం వస్తోందని అంటున్నారు. వారానికి రెండు, మూడు రోజులు ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నామని, అయినా ఏం లాభం లేదని వాపోతున్నరు. ‘మంత్రి చెప్పినా పని జరగదా సార్’ అని ప్రశ్నిస్తే.. ధరణిలో అప్షన్ లేకపోతే ఎవరు ఏం చెప్పినా ఏం చేయలేమని ఆఫీసర్లు తేల్చిచెప్తున్నారు.

- Advertisement -

భూసమస్యలపై అప్లికేషన్ పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వడం ఇదే మొదటి సారి కాదు. ధరణి వచ్చిన కొత్తలోనే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పెట్టుకునేందుకు ఆప్షన్లు ఇచ్చారు. తర్వాత కొన్ని రోజులకు తొలగించారు. అందులో పెట్టుకున్న అప్లికేషన్లకు అతీగతి లేకుండా పోయింది. దీంతో రైతుల పిల్లలు చాలా మంది మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్‌‌‌‌కు ధరణి సమస్యలను ఏకరువు పెట్టారు. స్పందించిన సీఎస్ వెంటనే వాట్సాప్ నంబర్, ఈమెయిల్ ఐడీ ప్రకటించి ఆప్లికేషన్లు తీసుకున్నారు. పది రోజుల్లో 23 వేల పైనే అప్లికేషన్లు వచ్చాయి. అందులో డిజిటల్ సైన్ వంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని పరిష్కరించి మిగతావన్నీ పక్కన పెట్టేశారు. పైగా మళ్లీ మీ సేవకు వెళ్లి అప్లై చేసుకోవాలని మెస్సేజ్ లు పంపి చేతులు దులుపుకున్నారు. అక్కడికి వెళ్తే ఆప్షన్లు కనిపించలేదు. ఈ క్రమంలోనే జూన్ 28న ఏ భూ సమస్య అయినా చెప్పుకోవచ్చని ఆప్షన్ ఇచ్చారు. అందులో నాలుగు రకాల సమస్యలను ప్రస్తావించారు. ఈ నెల మూడో తేదీన ఆ మాడ్యుల్ లో మార్పులు చేసి మరిన్ని ఇష్యూస్ ను చేర్చారు. ఏ ఇష్యూ కిందకు రాకుంటే అదర్స్ కేటగిరీలో అప్లికేషన్ పెట్టుకునే అవకాశమిచ్చారు. కానీ వచ్చిన అప్లికేషన్లను మాత్రం పరిష్కరించడం లేదు. పైగా జూన్ 28 నుంచి జూలై 2 వరకు పెట్టుకున్న అప్లికేషన్లన్నీ గల్లంతయ్యాయి.ధరణి పోర్టల్కు ముందు రెవెన్యూ అధికారులు పొరపాటున నోషనల్ ఖాతాల్లో పట్టా భూములను చేర్చారు. ఇరిగేషన్ కోసం తీసుకున్న వాటికి, వక్ఫ్ భూములకు, ఫారెస్ట్ భూములకు, గవర్నమెంట్ ల్యాండ్స్‌‌‌‌కు నోషనల్ ఖాతాలు ఉంటాయి. ఇలా అనేక భూములను ఇరిగేషన్ నోషనల్ ఖాతాల్లోకి ఇష్టమొచ్చినట్లు ఎంట్రీ చేశారు. కొన్ని ప్రభుత్వ భూముల్లోని నోషనల్ ఖాతాల్లోకి వెళ్లాయి. ఎక్కువగా ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద, హైవేల్లో భూములు పోయిన ప్రాంతాల్లోనే ఇది జరిగింది. నిజంగానే ప్రాజెక్టులు, కాలువలు, రోడ్లలో కొంత భూమి పోయి, విస్తీర్ణం కట్ చేసే టైంలో ఎక్కువ తీసేసిన వారికి తిరిగి మళ్లీ ఇచ్చే ఆప్షన్ ఉంది. కానీ అసలు భూములు పోకుండానే పోయినట్లు ఎంట్రీ అయిన వారికి మాత్రం అప్లై చేసుకోవడానికి ధరణి పోర్టల్‌‌‌‌లో అలాంటి అవకాశం లేదు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఆయా రైతులకు రైతుబంధు, బీమా, క్రాప్‌‌‌‌లోన్లు అందడం లేదు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:Dharani is still in trouble …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page