ఉభయ సభలు వాయిదా

0 7

న్యూఢిల్లీ ముచ్చట్లు :

 

 

ఉభయ సభల్లోనూ పెగాసస్ వివాదం కొనసాగుతూనే ఉంది. మంగళవారం కూడా ఈ వివాదం ఉభయ సభలనూ కుదిపేసింది. ప్రారంభమే విపక్షాలు ఈ అంశాన్ని లేవదీశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదాపడింది. రాజ్యసభలోనూ ఇదే తంతు కొనసాగింది. విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది. మరోవైపు పెగాసస్ స్పైవేర్ వివాదంపై సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్ ఆవరణలో సమావేశమయ్యారు. మరోవైపు పెగాసస్ వివాదం నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా జరిగింది. ప్రధాని మోదీ దీనికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వ్యవహార శైలిపై తీవ్రంగా మండిపడ్డారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags; Both houses adjourned

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page