ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజకీయ అనుభవమంతా మున్సిపల్ ఛైర్పర్సన్ వయస్సు లేదు

0 15

దూరదృష్టితోనే చలిగల్ లో ఏర్పాటు కు ఎమ్మెల్సీ ప్రతిపాదన
చలిగల్ లోనే మెడికల్ కాలేజు ఏర్పాటు చేయాలి
మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య డిమాండ్

జగిత్యాల  ముచ్చట్లు:

- Advertisement -

జగిత్యాల కు మంజురైనా మెడికల్ కాలేజ్ అందరికి అనువైన ప్రాంతంతో పాటు 50 ఎకరాల స్థలం ఉన్న చలిగల్ వ్యవసాయక్షేత్రంలో ఏర్పాటు చేయాలని జగిత్యాల మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కళ్ళెపెల్లి దుర్గయ్య, కౌన్సిలర్ నక్క జీవన్, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జగిత్యాల ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దుర్గయ్య, జీవన్, రాజేందర్ లు మాట్లాడుతూ జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ ధరూర్ క్యాంప్ ప్రాంతంలోనే మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలనడం, ప్రజలకు ఇబ్బందులు కల్గిoచ్చడమేనన్నారు.
వాణినగర్, బిటుబజార్ ప్రాంతంలో ధ్విచక్ర వాహనాలు వెళ్ళడానికి ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని, మెడికల్ కాలేజ్ కు 30 నుంచి 50 ఎకరాల స్థలం అవసరముంటుందని, ధరూర్ క్యాంపులో ఒకే చోట అంత స్థలం ఒకేచోట లేదని సూచించారు.ధరూర్ నుంచి ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాలువ నుండి తాటిపల్లి వరకు బైపాస్ రోడ్డును కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశామని, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాదు జిల్లాల ప్రజలకు  రాకపోకలకు అనుకూలంగా ఉంటుందని, దీంతో ఎవరికీ ఇబ్బందులుండవని,అందుకు చలిగల్ లోనే ఏర్పాటు చేయాలని సూచించారు. మెడికల్ కాలేజ్ మంజూరు ఇచ్చింది టీఆరెఎస్ ప్రభుత్వమని చలిగల్ వ్యవసాయ క్షేత్రంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డీకి ఎలా పేరువస్తుందని మున్సిపల్ ఛైర్పర్సన్ ను వారు ప్రశ్నించారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:MLC Jeevan Reddy does not have the age of Municipal Chairperson with all his political experience

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page