కారెపల్లి తెరాసలో ఢిష్యూం..ఢిష్యూం

0 2

ఖమ్మం   ముచ్చట్లు:

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం లో టీఆర్ఎస్  అధికార వర్గం అసమ్మతి వర్గం గ్రూపు రాజకీయాలు బజారున పడ్డాయి. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ పై సోషల్మీడియాలో కామెంట్లు రావడంతో వివాదం మొదలయింది. టీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఇరువర్గాల కార్యకర్తల మధ్యల వాగ్వివాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ మధ్య కాలంలో తరచుగా టిఆర్ఎస్ గ్రూపు వివాదాలకు కారేపల్లి మండలం వేదికగా మారింది.
వైరా నియోజకవర్గం కారేపల్లి లో శనివారం రాత్రి నుండి సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కామెంట్లతో రచ్చకేక్కిన తగాదాలు  తోపులాట, దాడుల వరకు వెళ్ళింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కారేపల్లి గ్రామపంచాయతీ పాలక వర్గంలో  వార్డు సభ్యులు మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి  గ్రూపులుగా గా విడిపోయి ఉన్నారు. ఈక్రమంలో పంచాయతీ నిధులు వినియోగంలో అవకతవకలపై మాజీ ఎమ్మెల్యే అనుచరులైన వార్డు సభ్యులు పిర్యాదులు చేయటం, విచారణ పూర్తి అయి సర్పంచ్, ఉపసర్ఫంచ్ సస్పెండ్ అయి తిరిగి పునర్నియామకం జరిగింది. దుర్వినియోగం అయిన నిధులు రికవరీ చేయాలని వార్డు సభ్యులైన ఎస్కే.గౌసుద్దీన్ హైకోర్టుకు, హెచ్ఆర్సీ వరకు వెళ్లాడు. దీనిపై విచారణ జరుగుతుంది. ఈక్రమంలో శనివారం రాత్రి మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి వర్గీయుడైన ఇమ్మడి తిరుపతిరావు వాట్సప్లో పెట్టిన కామెంట్ వివాదమైంది. వార్డు సభ్యుడైన ఎస్కె.గౌసుద్దీన్ ను అడ్డం పెట్టుకోని మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ నన్ను డబ్బులు అడిగిస్తున్నాడని, ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కు రూ. 50వేలు, నాకు రూ. 30 వేలు ఇవ్వాలంటూ రూ.80 వేలు ఇవ్వలంటూ బెదిరించి డబ్బులు తీసుకున్నాడని వాట్పస్ మెసేజ్లో ఆరోపించాడు. ఈమెసేజ్పై మాజీ ఎమ్మెల్యే వర్గీయులు భగ్గుమన్నారు. ఇమ్మడి తిరుపతిరావు చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. ఇమ్మడి తిరుపతిరావుపై మాజీ ఎమ్మెల్యే వర్గీయులు పోలీసులకు పిర్యాదు చేశారు.
టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేసుకునే వరకు వర్గరాజకీయులు వెళ్ళాయి.  ఇమ్మడి తిరుపతిరావు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉన్నాడని విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్గీయులు కార్యాలయంకు వెళ్ళి ఇమ్మడి తిరుపతిరావును బయటకు రావాలని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో పార్టీ నూతన అధ్యక్షుడు తోటకూరి రాంబాబు జోక్యం చేసుకోని విషయంపై ఆరా తీస్తుండగా  విషయం తెలియని నీవు ఏమి అధ్యక్షుడివి అంటూ మాజీ ఎమ్మెల్యే వర్గీయులు వ్యాఖ్యనించటంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగి నెట్టుకున్నారు. కారేపల్లి ఎస్సై పీ.సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి ఇరువర్గాలను సముదాయించి పంపించి వేశారు. అనంతరం ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ పెద్దమ్మతల్లి ఆలయంలో జరిగే బోనాల ఉత్సవానికి హాజరైనాడు. ఎమ్మెల్యే కార్యక్రమంలో నడుస్తుండగా మాజీ ఎమ్మెల్యే వర్గీయుడైన వార్డు సభ్యుడు ఎస్కె.గౌసుద్దీన్, వాట్సఫ్లో తిరుపతిపరావు కామెంట్ను సమర్ధిస్తూ కామెంట్ చేసిన మజీద్ పాషాపై దాడి చేశాడు. దీంతో కారేపల్లి లొ ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే కారు వెళ్లుంతుండగా దాని వెనకాలే ఉన్న ఇమ్మడి తిరుపతిరావు కారు ను అడ్డగించటానికి మాజీ ఎమ్మెల్యే వర్గీయులు ప్రయత్నించారు. టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న తోపులాట తన్నులాటపై ఇరువర్గాలు కారేపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదులు చేసుకున్నారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:Dishyum..Dishyum in Karepally Teresa

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page