కొనసాగుతున్న ఈటెల పాదయాత్ర

0 22

కరీంనగర్  ముచ్చట్లు:
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర రెండవరోజు కొనసాగింది. యాత్ర నేరెళ్ల గ్రామానికి రాగానే గ్రామస్థులు ఊరు పొలిమేరకు తరలివచ్చి స్వాగతం పలికారు. ముందుగా ఈటల హనుమాన్ గుడి లో ప్రత్యేక పూజలు చేసారు. ఈటె ల రాజేందర్ మాట్లాడుతూ నేరెళ్ళ ధర్మం తప్పదు. ఎవరి ప్రచారం వారిని చేసుకోనివ్వండి. అనుమతులు ఇచ్చారు. కానీ జెండాలు పీకివేసుడు. కొడకా, మేము తలుచుకుంటే జరిగేది వేరే. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. నక్సలైట్లు అనుకుంటున్నారా?  గులాబీ కండువా వేసుకోండి, కెసిఆర్ కు బానిసలు అని ప్రకటించుకొండని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్లు ఎటు పోయినారు. కేసిఆర్ దళితుల మీద ప్రేమ ఒక మోసం. దళిత సీఎం ఎటుపోయింది?  ఉప ముఖ్యమంత్రి నీ ఎందుకు పీకినవ్?  మూడు ఎకరాల భూమి ఎటు పోయింది?  పెన్షన్లు ఎటు పోయినాయి?  10 కోట్లు ఇచ్చిన మా ప్రజలు ఆత్మను అమ్ముకోరు. మా డబ్బుతో సోకులు చేసేది మీరు.  రంగనాయక సాగర్ కి తీసుకు పోయి మనుషులను కొంటున్నవ్ హరీశ్ రావు నిన్ను కూడా కెసిఆర్ వదిలి పెట్టడు. నీకు నా గతే పడుతుందని అన్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

- Advertisement -

Tags:Privatization of Visakhapatnam Steel Plant will not be tolerated
-Vishakha MP M.V. V Satyanarayana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page