చంద్రగిరి సమీపంలోని శ్రీనివాస మంగాపురం వద్ద 9 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.

0 2

 

అడవుల్లో స్మగ్లర్లు ఉన్నట్లు సమాచారం
రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్.
– రెండు బృందాల టాస్క్ ఫోర్స్ బలగాలు.

 

- Advertisement -

శ్రీనివాసమంగాపురం ముచ్చట్లు :

 

తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం వద్ద మంగళవారం తెల్లవారుజామున తొమ్మిది ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది ఎర్రచందనం స్మగ్లర్లు అడవుల్లో ఉన్నట్లు సమాచారం రావడంతో డాగ్ స్క్వాడ్ సహాయం తో రెండు టాస్క్ ఫోర్స్ టీమ్ లు శేషాచలం అడవులను జల్లెడ పడుతున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి శ్రీవారిమెట్టు , శ్రీనివాస మంగాపురం అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. మంగళవారం తెల్లవారు జామున 3.00 గంటల సమయంలో కొంతమంది ఎర్ర చందనం దుంగలను మోసుకుని వెళుతూ తారస పడ్డారు. వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, దుంగలను పడేసి పారిపోయారు. ఆ ప్రాంతంలో తొమ్మిది ఏ1 క్వాలిటీ దుంగలు లభించాయి.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:9 red sandalwood logs seized at Srinivasa Mangapuram near Chandragiri.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page