జులై30న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతున్న తేజ స‌జ్జా, ప్రియా వారియ‌ర్‌, మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ `ఇష్క్`.

0 16

సినిమా ముచ్చట్లు:

సౌత్ ఇండియాలోని ప్ర‌తిష్ఠాత్మ‌క బ్యాన‌ర్ల‌లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ ఇటీవ‌ల ‘జాంబీ రెడ్డి’ మూవీతో సూప‌ర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ స‌జ్జాతో  ‘ఇష్క్‌` చిత్రాన్ని నిర్మిస్తోన్న విష‌యం తెలిసిందే.. నాట్ ఎ ల‌వ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌,ట్రైల‌ర్‌, సాంగ్స్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ చిత్రాన్ని జులై30న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌.
మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ బాణీలు స‌మ‌కూరుస్తున్నారు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ఎ. వ‌ర‌ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, విఠ‌ల్ కొస‌నం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.
తారాగ‌ణం: తేజ స‌జ్జా, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Teja Sajja, Priya Warrior, Mega Super Good Films’ Ishq` which will be released on July 30 as Grand.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page