టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్!

0 9

కరీంనగర్‌ ముచ్చట్లు :

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు అభ్యర్థే లేడని, ఈటలను ఢీకొనే సత్తా కలిగిన అభ్యర్థి ఎవరని వెదుకుతూ అధికార పార్టీ ఇతర పార్టీలవైపు చూస్తున్నదని ప్రచారం జరుగుతున్న తరుణంలో కొత్తపేరు తెరపైకి వచ్చింది. గతంలో కరీంనగర్‌ ఎస్పీగా పనిచేసిన, ప్రస్తుతం రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా ఉన్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో తొలి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి పట్టు ఉండడంతో ఆ వర్గానికే చెందిన అభ్యర్థినే పోటీలో ఉంచాలని టీఆర్‌ఎస్‌ భావించింది. బీజేపీ నుంచి బీసీ వర్గానికి చెందిన ఈటల పోటీలో ఉంటున్నందున బీసీనిగాని, రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని కాని బరిలోకి దింపాలని టీఆర్‌ఎస్‌ యోచిస్తోంది.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:RSS Praveen Kumar as TRS candidate!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page