తాళ్ళపాక‌ శ్రీ చెన్నకేశవ, శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయాల్లో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం

0 3

తిరుపతి ముచ్చట్లు:

 

కడప జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాకలోని చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం, శ్రీ సిద్దేశ్వర స్వామివారి ఆల‌యాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 20 నుండి జూలై 28వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం ఉదయం ధ్వ‌జారోహ‌ణంతో ఈ ఆల‌యాల్లో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి.ఈ రెండు అలయాల్లో వేరువేరుగా ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజ పటం ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాలు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వహించారు.బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా వాహ‌న‌సేవ‌లు ఉద‌యం 8 గంట‌ల‌కు, సాయంత్రం 6 గంట‌ల‌కు ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.ఈ కార్య‌క్ర‌మాల్లో ఏఈవో   ముర‌ళిధ‌ర్‌, సూపరింటెండెంట్  వేంక‌టేష్‌, టెంపుల్ ఇన్స్పెక్టర్   అనిల్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Brahmotsavalu begins at Sri Chennakesava and Sri Siddheswaraswamy temples in Thallapakam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page