దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా మహమ్మారి   గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,093 పాజిటివ్‌ కేసులు నమోదు

0 7

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,093 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 125 రోజుల తర్వాత కరోనా కేసులు 30వేలకు చేరాయి. మరో వైపు కొత్తగా 45,254 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ బారినపడి 374 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,11,74,322కు పెరిగింది. ఇందులో 3,03,53,710 మంది డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి ప్రభావంతో మొత్తం 4,14,482 మంది బాధితులు ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 4,06,130 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరో వైపు టీకా డ్రైవ్‌ కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Corona epidemic on the decline in the country
30,093 new positive cases were registered in the last 24 hours

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page