నాగోబా ఆలయంలో ప్రవీణ్ కుమార్ పూజలు

0 7

ఆదిలాబాద్  ముచ్చట్లు:
ఆదిలాబాద్ జిల్లా  ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో నాగోబాకు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ లో కుమ్రం భీం , అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులార్పించారుఏ. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ  నేను ఏ పార్టీలో చేరడం లేదు, అసలు రాజకీయాల్లోకే రావడం లేదు.  బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడతాను.  నాపై వస్తున్న సోషల్ ప్రచారాలను నమ్మవద్దని కోరుతున్నా.. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం స్వేరో కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. దంతనపల్లిలో జ్ఞాన ఖడ్గ దారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆదిలాబాద్ అడవుల నుండే నూతన ప్రయాణం లోకి అడుగు పెడుతున్నందుకు సంతోషిస్తున్నా. రాజకీయాల్లోకి రావడమా లేదా అన్నది త్వరలోనే ప్రకటిస్తా.. ప్రతి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉన్నత విద్య అందాలి. అందరు బాబా సాహేబ్ అంబేద్కర్ స్థాయికి చేరుకోవాలి.. మంగి ,కవ్వాల్ అభయారణ్యాల నుండి దేశం గర్వించే స్థాయికి విద్యార్థులు చేరాలి. ఆర్ఎస్ ప్రవీణ్ ఎవరికి అమ్ముడుపోయే వ్యక్తికాదు. సోషల్ మీడియాలో అసత్యప్రచారాలు ఆపాలి. స్వేరో ప్రయాణం నిరంతరం.. గురుకులాలకు నాకంటే గొప్ప ఆపీసర్లు వస్తారని అన్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

- Advertisement -

Tags:Praveen Kumar worship at Nagoba Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page