పార్టీ పటిష్టతకు కృషి చేయాలి.ఎమ్మెల్యే డాక్టర్. సంజయ్ కుమార్

0 2

జగిత్యాలముచ్చట్లు:

టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సూచించారు . జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త,మాజీ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుడాల రాజేష్ గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరగా మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజేష్ గౌడ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ఇందులో భాగంగానే రాజేష్ గౌడ్ బీజేపీ పార్టీ ని వీడి టిఆర్ఎస్ లో చేరడం శుభపరిణామం అని ఎమ్మెల్యే తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టతకి మరింత దోహదపడాలని రాజేష్ గౌడ్ కు సూచించారు.అలాగే గుడాల రాజేష్ గౌడ్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత సురేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్, రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు తదితరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు..

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:We must work for the strengthening of the party. Sanjay Kumar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page