పుంగనూరులో ఆర్‌బికెల ద్వారా రైతుల ముంగిటకు వ్యవసాయం-అక్కిసాని భాస్కర్‌రెడ్డి

0 128

పుంగనూరు ముచ్చట్లు:

 

 

ప్రభుత్వం రైతుల ముంగిటకు వ్యవసాయ విధానాలను, పరికరాలను , ఎరువులు, విత్తనాలను అందించడంతో రైతుల కష్టాలు తీరిందని మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వనమలదిన్నె, బసివినాయునిపల్లె, ఆరడిగుంట ఆర్‌బికెలలో రైతు చైతన్యయాత్రలను ఏవో సంధ్య , హెచ్‌వో లక్ష్మీప్రసన్న, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డితో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించాల్సిన పంటలపై అవగాహన కల్పించడం, వాటి మార్కెటింగ్‌, ఈక్రాప్‌ నమోదుపై వివరించారు. అలాగే ఉధ్యానవన పంటలు పండించాల్సిన తీరు తెన్నులను వివరించారు. పశుదాణా, పశువుల నష్టపరిహారంపై రైతులు అవగాహన కల్పించుకుని ఎవరు నష్టపోరాదన్న ప్రభుత్వ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌, సర్పంచ్‌లు మునస్వామి, శంకరప్ప, ఎంపీటీసీలు సూరప్ప, నంజుండప్ప, వెంకట్రమణ, కార్యదర్శులు పద్మనాభరెడ్డి, సుధాకర్‌రావు, నాగేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Agriculture-Akkisani Bhaskarreddy for the advancement of farmers through RBKs in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page