పూలంగి సేవలో పునీతుడైన వీరాంజనేయ స్వామి

0 42

– వైభవంగా తొలి ఏకాదశి పూజలు
-ప్రత్యేక పూజల్లో కెసిపల్లి సర్పంచ్

 

రామసముద్రం ముచ్చట్లు:

 

- Advertisement -

మండలంలోని కుదురుచీమనపల్లి పంచాయతీ వై. కుర్రప్పల్లిలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజలను ఆలయ అర్చకులు కె. లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయం చోళ రాజుల కాలంలో ప్రతిష్ఠించారు. కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకోవడంతో అప్పటి ఆలయ ప్రధాన అర్చకులు స్వర్గీయ హెచ్ కె. సర్వోత్తమ రావు, స్వర్గీయ కె. కృష్ణమూర్తి రావులు సీనియర్ జర్నలిస్ట్ క్రిష్ణయ్యగారి శ్రీధర్ రావు దృష్టికి తీసుకువచ్చారు. భద్రాచలంలో శ్రీరామచంద్ర మూర్తి ఆలయ నిర్మాణానికి శ్రీరామదాసు ఏ విధంగా శ్రమ పడ్డారో అదే రీతిలో శ్రీధర్ రావు ఆలయ నిర్మాణ భారాన్ని భుజాన వేసుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అప్పటి మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషాల దృష్టికి ఆలయ నిర్మాణం విషయం తెలపగా వారు స్పందించి సీజీఎఫ్ నుంచి సుమారు రూ.4.80లక్షలు మంజూరు చేయించి చేయూతను ఇచ్చారు. దాతల దాతృత్వంతో… దేవాదాయ శాఖ, గ్రామస్థుల సహకారంతో సుమారు రూ.40లక్షల ఖర్చుతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా 2012వ సంవత్సరంలో పునః ప్రతిష్టించారు. అప్పటి నుంచి ప్రతి పౌర్ణమి మరియు పర్వదినాల సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు విశేష పూజలు, అభిషేకాలతో పాటు స్వామివారికి ప్రీతిపదమైన పూలంగి సేవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి స్వామివారికి అభిషేకం, అర్చనలు నిర్వహించారు. కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Veeranjaneya Swami, a saint in the service of Poolangi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page