పెగాస‌స్ స్పైవేర్‌పై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు

0 5

ప్ల‌కార్డుల‌తో నినాదాలు.. సభాకార్యక్రమాలకు అంతరాయం
ఉభ‌య‌స‌భ‌లు వాయిదా
న్యూఢిల్లీ  ముచ్చట్లు:

 

 

- Advertisement -

పెగాస‌స్ స్పైవేర్‌పై పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు ఇవాళ విప‌క్ష నినాదాల‌తో హోరెత్తాయి. పెగాస‌స్ స్పైవేర్‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని విప‌క్ష స‌భ్యులు డిమాండ్ చేశారు. ప్ర‌శ్నోత్త‌రాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో విప‌క్ష స‌భ్యులు ప్ల‌కార్డుల‌తో వెల్‌లోకి దూసుకువ‌చ్చి సభాకార్యక్రమాలకు అడ్డు తగిలారు. స్పీక‌ర్ ఓం బిర్లా వారిని వెన‌క్కి వెళ్లాల‌ని ఆదేశించినప్పటికి విప‌క్ష స‌భ్యులు నినాదాలు ఆప‌లేదు. దీంతో స్పీక‌ర్ బిర్లా.. విప‌క్ష స‌భ్యుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌రైన రీతిలో నోటీసు ఇవ్వ‌లేద‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వం ఆ అంశంపై సోమ‌వార‌మే ప్ర‌క‌ట‌న చేసింద‌న్నారు. అయినా ప్ర‌తిప‌క్ష స‌భ్యులు నినాదాలు కొన‌సాగించారు. అన్ని అంశాల‌పై స‌మాధానం ఇవ్వ‌డానికి ప్‌ భుత్వం సిద్ధంగా ఉంద‌ని స్పీక‌ర్ తెలిపారు. గంద‌ర‌గోళం మ‌ధ్య స్పీక‌ర్ స‌భ‌ను మధ్యాహ్నం రెండు గంట‌ల‌కు వాయిదా వేశారు. రాజ్య‌స‌భ‌లోనూ ఇదే సీన్ రిపీటైంది. విప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి దూసుకురావ‌డంతో.. స‌భ‌ను చైర్మ‌న్ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు. లోక్‌సభ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రీ మాట్లాడుతూ.. పెగాస‌స్ లాంటి ఇంటెలిజెన్స్ సిస్ట‌మ్‌ను ఎప్పుడైనా కాంగ్రెస్ వాడిందా.. ఇలాంటి గూఢ‌చ‌ర్యం గురించి త‌మ‌కు తెలియ‌ద‌న్నారు. న్యూ ఇండియా మేకింగ్‌కు ఇదో స్ట్రాట‌జీ అని అధిర్ ఆరోపించారు. ప్ర‌భుత్వానికి, పెగాస‌స్ ఇష్యూకు సంబంధం లేద‌ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి తెలిపారు. ఒక‌వేళ ఆ స‌మ‌స్య‌ను వాళ్లు లేవ‌నెత్తాల‌నుకుంటే, దాన్ని స‌రైన రీతిలో ప్ర‌శ్నించాల‌న్నారు. ఇప్ప‌టికే ఆ అంశంపై మంత్రి స‌మాధానం ఇచ్చిన‌ట్లు జోషీ తెలిపారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Oppositions to the debate over Pegasus spyware

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page