పెట్రోల్ ధరలు భరించలేక గుర్రమెక్కిన తాపీ మేస్త్రి

0 11

కళ్యాణదుర్గం  ముచ్చట్లు:
వచ్చే 300 రూపాయల కూలి డబ్బుల్లో లో సగం డబ్బులు పెట్రోల్ ధరలకు భరించలేనని తక్కువ బడ్జెట్ లో ఓ గుర్రమెక్కి తన రోజువారీ పనులు చేసుకుంటున్నాడు ఓ తాపీ మేస్త్రి.   అనంతపురం జిల్లా కుందుర్పి మండలం ఎస్. మల్లాపురం గ్రామానికి చెందిన తాపీ మేస్త్రిగా పని చేసుకునే హనుమంత రాయుడు తన టీవీఎస్ ను నడుపు కోలేక 12 వేల రూపాయలు వెచ్చించి తాజాగా ఒక గుర్రాన్ని దానిపై ప్రయాణిస్తూ తన కూలీల జీవనం సాగిస్తున్నాడు. ఈ తతంగమంతా గమనించిన ఈ ప్రాంత గ్రామంలో తిరిగి రాజుల కాలానికి వెళ్లాల్సి వస్తుందని చర్చించుకుంటున్నారు ఈ ప్రాంత వాసులు.బేల్దారి పని చేసుకునే హనుమంతరాయడు ఎక్కువగా సమాధుల నిర్మాణానికి ఎదుర్కొంటానని మన గ్రామానికి సమీపంలో ఉన్న కర్ణాటక ప్రాంతంలోని పలు గ్రామాల్లో తనకు కూలి దొరుకుతుందని అయితే రోజుకు మూడు వందల లో టీవీఎస్ నడపాలంటే 150 రూపాయలు పెట్టించుకో వస్తోందని ఆ భారాన్ని భరించి కుటుంబ పోషణ  భారం కావడంతో ఇటీవల సంచారజాతుల వారితో 12 వేల రూపాయలకు గుర్రాన్ని కొని తన ఇరుగు పొరుగు ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో గుర్రాన్ని స్వారీ చేస్తూ పెట్రోల్ ధర పై డబ్బు ఆదా చేసుకుంటున్నానని అమాయకంగా చెబుతున్నాడు హనుమంతరాయడు. తాను కూలీ పనికి వెళ్లిన సమయంలో కూడా అక్కడ  రోడ్డు పక్కన కొంత గడ్డి మేపిస్తూ తాను గుర్రం పోషణ భారం కూడా తగ్గించుకుంటున్నారు అని హనుమంతరాయుడు చెబుతున్నాడు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

- Advertisement -

Tags:Horsemanship masonry unable to afford petrol prices

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page