పెద్దపల్లి జిల్లాలో ఉపాధి లో 23 లక్షల మొక్కలు

0 7

– ఢీఆర్ఢీఓ అడిషనల్ పీడీ పోడం వెంకటేశ్వర్లు

పెద్దపల్లి ముచ్చట్లు:

 

 

- Advertisement -

పెద్దపల్లి జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా ఈ విడత 23 లక్షల మొక్కలు నాటుతున్నామని పెద్దపల్లి జిల్లా ఢీఆర్ఢీఓ పీడీ పోడం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం రత్నాపూర్ గ్రామం లో అయన పర్యటించారు. 75 స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల సందర్బంగా ఈ నెల 19 నుండి 30 వరకు నరేగా ప్లాంటేషన్ డ్రైవ్ లో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల్లో మొక్కలు నాటలని కోరారు. జిల్లాలో 266 గ్రామ పంచాయతీలుండగా అన్ని గ్రామ పంచాయతీలల్లో నర్సరీలు ఏర్పాటు చేశామని అన్నారు, ఇప్పటికె జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, ఢీఆర్ఢీఓ పీడీ శ్రీధర్ ఆధ్వర్యంలో 14 లక్షల మొక్కల వరకు నాటామని తెలిపారు. గ్రామ పంచాయతీల్లో మొక్కలు నాటడం, సంరక్షంచటంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సర్పంచ్ పల్లె ప్రతిమ పివీరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తూముట్ల విజయ్ కుమార్, ఉపాధి ఏపీవో నర్సింగ్ రమేష్, కార్యదర్శి ఉప్పులేటి ప్రదీప్, రత్నాపూర్ రైతు సమితి అధ్యక్షుడు సాగర్ల తిరుపతి, సందెవేన కుమార్, ధర్ముల వెంకటేష్, విష్ణుభక్తుల వంశీ లు పాల్గొన్నారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

 

Tagd\s:23 lakh plants in employment in Peddapalli district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page