పేదింటి ఆడబిడ్డలకు భరోసా సీఎం కేసీఆర్

0 6

ఎమ్మెల్యే డాక్టర్ .సంజయ్ కుమార్
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

జగిత్యాల   ముచ్చట్లు:

- Advertisement -

కల్యాణలక్ష్మీ ,షాదీముభారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డల పెళ్లీలకు సీఎం కేసీఆర్ భరోసాగా నిలుస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గీతా భవన్ జరిగిన సమావేశంలో
పట్టణ,అర్బన్ మండలానికి చెందిన 79 మంది ఆడపడుచులకు కల్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన 79 లక్షల 9 వేల విలువగల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజాయ్ కుమార్ చేతులమీదుగా పంపిణీ చేశారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ వెంట మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి,జిల్లా గ్రంథాలయ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, జిల్లా యూత్ అధ్యక్షుడు దావా సురేష్ , కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.
ముక్కోటి వృక్షార్చన
పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

: రాష్ట్ర ఐటి శాఖల, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఈనెల 24న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలేంజ్ వారి ఆధ్వర్యంలో తలపెట్టిన  ముక్కోటి వృక్షార్చన కార్యక్రమానికి ఎమ్మెల్యే
పిలుపు మేరకు జులై 24 వ ముక్కోటి వృక్షార్చన  కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలకు ఒకేరోజు ఒక గంటలో మూడు కోట్ల మొక్కలు నాటే ముక్కోటి వృక్షార్చన పోస్టర్ ను మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Assurance to poor girls CM KCR

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page