పోలవరం నిర్వాసితుల కష్టాలు ఇంతింతకాదయా

0 8

ఏలూరు ముచ్చట్లు:

పోలవరం పునరావాసంలో భాగంగా ప్రభుత్వం గోకవరం మండలం కృష్ణునిపాలెంలో ప్లాట్‌ నంబర్‌ 538ని కేటాయించింది. ప్రస్తుతం ఈ ఇంటి స్లాబు నుంచి వర్షపు నీరు కారుతోంది. మరుగుదొడ్డి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. తాగునీటి సౌకర్యమూ లేదు. ఈ ఇంట్లో ఉండే వీలులేక అదే కాలనీలో మరమ్మతులు పూర్తైన తన బంధువుల ఇంట్లో భార్య, బిడ్డలతో తలదాచుకుంటున్నాడు. చౌడు నేలలో నాసిరకంగా ఇళ్లు నిర్మించారని, ఇంటి చుట్టూ మొకాల్లోతు బురద ఉందని, మరమ్మతుల కోసం కనీసంగా రూ.3 లక్షలు వరకూ ఖర్చవుతుందని వాపోయాడు. గోకవరం మండలంలోని కృష్ణునిపాలెంలో ప్రభుత్వం నిర్మించిన పునరావాస కాలనీలో నిర్వాసులందరిదీ. ప్రభుత్వం ఇక్కడ 1,045 ఇళ్లను పోలవరం నిర్వాసితుల కోసం నిర్మించింది. దేవీపట్నం మండలంలోని ఎ.వీరవరం, సిహెచ్‌.రమణయ్యపేట, కచ్చులూరు, సీతారం, గంగంపాలెం, కొండమొదలు, తాళ్లూరు, తలిపేరు, దండంగి, తొయ్యేరు, మెట్టగూడెం, మెట్టవీధి, మూలపాడు, మంటూరు, ముమ్మిడిపల్లిలోని గిరిజనేతరులకు ఈ కాలనీలో ఇళ్లను కేటాయించారు. ఇక్కడ ప్రస్తుతం 800 కుటుంబాలు ఉంటున్నాయి.

- Advertisement -

2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు 25 రకాల మౌలిక వసతులను కల్పించాల్సి ఉంది. అవేమీ లేకుండానే ప్రభుత్వం బాధితులను బలవంతంగా తరలించేసింది.కృష్ణునిపాలెంలో మొత్తం 1,067 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. ప్రతి లబ్ధిదారునికి ఐదు సెంట్ల స్థలం కేటాయించారు. 2.5 సెంట్లలో ఇంటిని నిర్మించారు. స్థల వివాదం కారణంగా భూ యజమానికి కోర్టు కెళ్లడంతో 22 ఇళ్ల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 1,045 ఇళ్లను హడావుడిగా పూర్తి చేసి 2019 జనవరిలో ప్రారంభించారు. వీటిలో 800 ఇళ్లకు మాత్రమే విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. 900 ఇళ్లకు మరుగుదొడ్లను పూర్తి చేసినట్టు చూపారు. కానీ, అవి ఇంకా వివిధ దశల్లోనే ఉన్నాయి. చౌడు భూమి కావడంతో నిర్మాణాలు ఎంతకాలం ఉంటాయో చెప్పలేని పరిస్థితి. ఇంటి స్లాబుల నుంచి నీరు వెళ్లే దారిలేదు. దీనికితోడు స్లాబుల్లో కూడా నాణ్యత కొరవడడంతో ఇంటిపై నిల్చిపోయిన నీరు గదుల్లోకి కారుతోంది. ప్రతి ఐదు ఇళ్లలో రెండు ఇళ్లకు మాత్రమే మరుగుదొడ్లను నిర్మించారు. మిగిలినవి ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. మరుగుదొడ్ల కోసం ఏర్పాటు చేసిన గోతుల్లో ఊట నీరు వస్తోంది. మరికొన్ని మరుగుదొడ్లకు డోర్లను కూడా ఏర్పాటు చేయలేదు. కొన్ని ఇళ్లకు తాగునీటి కోసం ఏర్పాటు చేసినా కుళాయిలను మరుగుదొడ్లో బిగించారు. ఇళ్లకు మెట్లు, ప్రహరీలు లేవు. దీంతో, ప్రతి ఇంటినీ రీమోడలింగ్‌ చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం పునరావాస చట్టం ప్రకారం 25 రకాల మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపింది. కానీ, ఇక్కడ కనీస వసతులు కూడా కరువయ్యాయి. ఎక్కడా వీధి దీపాలు లేవు. రాత్రయితే చిమ్మచీకట్లు అలుముకుంటు న్నాయి. తాగునీటి సదుపాయం కూడా లేదు. వాడకపు నీటిని మాత్రం రోజుకు గంటపాటు సరఫరా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో మరో పది వరకూ సిసి రోడ్లను వేయాల్సి ఉంది. చట్టం ప్రకారం ఇళ్లతో పాటు శ్మశాన వాటిక, వైద్యశాల, పాఠశాల భవనం, షాపింగ్‌ కాంప్లెక్స్‌, పోస్టాఫీసు, బస్సు షెల్టర్‌, పార్కు, ఆట స్థలాలు, పారిశుధ్య నిర్వహణ కేంద్రం, న్యూట్రిషన్‌ గార్డెన్‌, అంగన్‌వాడీ కేంద్రం వంటివి నిర్మించాలి. వీటిలో చాలా పనులు ప్రారంభం కాలేదు. ప్రారంభమైనవి కూడా మధ్యలోనే నిలిచిపోయాయి.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:The plight of the Polavaram settlers is imminent

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page