మంత్రి నిరంజన్ రెడ్డి బేషరతుగా  క్షమాపణ చెప్పాలి

0 9

మంత్రి వ్యాఖ్యలపై బీజేవైఎం నాయకులు బూట్ పాలిష్ చేస్తూ నిరసన

జగిత్యాల  ముచ్చట్లు:
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి హోదాలో ఉండి నిరంజన్ రెడ్డి నిరుద్యోగులను కులీపనులు పని చేస్తే తప్పేంటి  చేసిన వ్యాఖ్యలు చేసినందుకు బిజేవైఎం పట్టణ అధ్యక్షులు కొండ రవితేజ అధ్వర్యంలో పట్టణంలో
బూట్ పాలిష్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బిజేవైఎం పట్టణ అధ్యక్షులు కొండ రవితేజ మాట్లాడుతూ మంత్రి నిరంజన్ రెడ్డి బంధువులు కులీ పని చేయగలరని ప్రశ్నించారు. మంత్రి బేషరతుగా నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికి 7 సంవత్సరాలు అయిన కానీ విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మళ్ళీ రెండోవ సారి ఎన్నికల ముందు మేనిఫెస్టో లో చెప్పినటువంటి నిరుద్యోగ భృత్తి నెలకు 3016 ఇస్తానని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికి 2వ సారి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృత్తి ఇవ్వకపోవడం సిగ్గు చేటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గడ్డం వెంకటేష్, ముస్కం సాయి, సంపంగి రమేష్, నిఖిల్,  లోకేష్ , సాయి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Minister Niranjan Reddy should unconditionally apologize

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page