ముగిసిన ప్రివిలేజ్ కమిటీ భేటీ

0 9

అమరావతి  ముచ్చట్లు:
ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది.దీనిపై ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రివిలే జ్ కమిటీ పారదర్శక రీతిలో కార్యకలా పాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సభలో 174 మందికి ప్రాతినిధ్యం వహి స్తున్న స్పీకర్ పైనా విమర్శలు చేస్తున్నా రని, కొందరు సభ్యుల వైఖరిని ఆధారాలు సహా ప్రశ్నించినా వారి నుంచి స్పందన కరవైందని తెలిపారు. ఆశించిన రీతిలో స్పందించని సభ్యుల ను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించినట్టు వెల్లడించారు.టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ సరిగా లేదని, అందుకే ఆయనను మరోసారి వివరణ కోరగా, ఏమాత్రం బదులివ్వలేదని ఆరోపిం చారు. అందుకే ఆయనను వ్యక్తిగతం గా హాజరు కావాలని కోరామని వివరించారు.శాసనసభ్యుల హక్కులు కాపాడడం తమ కర్తవ్యం అని కాకాణి పేర్కొన్నారు. ఎవరు ఎవరిపై వ్యాఖ్యలు చేసినా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

- Advertisement -

Tags:’Concluded Privilege Committee Meeting

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page