యాదాద్రీశుడి సన్నిధి లో స్వామి, అమ్మవార్లకు లక్ష పుష్పార్చన

0 2

యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:
యాదాద్రీశుడి నిత్య పూజలు వేకువజామునే ప్రారంభం అయ్యాయి.సర్వేశ ఏకాదశి (తొలి ఏకాదశి) పర్వదినం పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా, వైభవంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటలపాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి. ప్రతి ఏకాదశి పర్వదినం రోజు స్వయంభూ పంచనారసింహుడు కొలువుదీరిన యాదాద్రి క్షేత్రంలో స్వామికి లక్ష పుష్పాలతో అర్చనలు జరపడం ఆలయ సంప్రదాయం. స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలతోపాటు ప్రత్యేక సుదర్శన నారసింహహోమం నిర్వహించారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

- Advertisement -

Tags:Laksha Pushparchana for Swami and Ammavarla in the presence of Yadadrishu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page